దిల్ రాజు తాజా ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. శంకర్ ఇండియన్ 2 రిజల్ట్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. దాంతో శంకర్ మీద విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో గేమ్ చేంజర్ కథను శంకర్ చెప్పిన్పుడు నేను ఏదైతే నమ్మానో దాని మీద శంకర్ తో చాలా సార్లు డిస్కషన్ పెట్టుకున్నాను. గేమ్ చేంజర్ రిజల్ట్ హీరోకి, మీకు, నాకు ఎంతో ముఖ్యమని చెబుతూ వర్క్ చేస్తూ వచ్చాం. గేమ్ చేంజర్ విషయానికి వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో ఏ రకంగా తీసుకున్నా ప్రేక్షకులు సినిమా చూసి విజిల్స్ కొట్టే మూమెంట్స్ చాలానే ఉంటాయి. ‘శంకర్ ఎంత పెద్ద కమర్షియల్ సినిమా చేసినా అందులో మంచి మెసేజ్ ఉండేది, అలాగే నువ్వు కూడా ఎంత పెద్ద కమర్షియల్ సినిమా చేసినా ఒక వేల్యూ ఉండేది’ అని ఓసారి చిరంజీవి అన్నారు. శంకర్ గేమ్ చేంజర్ కథ చెప్పినప్పుడు నేను ఫీల్ అయిన దానికి, చిరంజీవి స్టేట్‌మెంట్.. రెండూ సింక్ అయ్యాయి. కమర్షియల్ అంశాలతో పాటు రెస్పెక్ట్‌గా ఫీల్ అయ్యే సినిమా గేమ్ చేంజర్. మూడు, నాలుగున్నరేళ్ల ఎమోషన్స్‌కు మరో మూడు నాలుగురోజుల్లో ఫలితం రానుంది. సినిమా చూసే ప్రేక్షకుల నుంచి మంచి అప్రిషియేషన్స్ వస్తాయి. వారికి వావ్ మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి.
Anjali: ‘గేమ్ చేంజర్’లో నా పాత్రే గేమ్ చేంజర్ : అంజలి
ముంబైలో మీడియా ఇంటరాక్షన్‌కు వెళ్లినప్పుడు శంకర్‌ని ఒప్పించి జరగండి సాంగ్‌ను అందరికీ చూపించా, అందరూ అద్భుతంగా రియాక్ట్ అయ్యారు. సాంగ్స్ కోసం రూ.75 కోట్లు ఖర్చు పెట్టాం. అద్భుతమైన విజువల్ గ్రాండియర్‌తో పాటలు మెప్పించనున్నాయి. సినిమా 2 గంటల 43 నిమిషాలు రన్ టైమ్ ఫిక్స్ అయ్యింది. సినిమా చక చకా పరుగులు పెడుతుంది. నేను చాలా ఎగ్జయిటెడ్‌గా వెయిట్ చేస్తున్నాను. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం నాకు కమ్ బ్యాక్ ఫిల్మ్స్ అని నమ్మకంగా ఉన్నాను. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విషయానికి వస్తే ఆల్‌రెడీ సూపర్ హిట్ అని అందరూ అంటున్నారు. ఈ బజ్ రావటానికి కారణం అనీల్ రావిపూడి. తను కథ చెప్పినప్పటి నుంచి అన్నీ తన మీద వేసుకుని సినిమాను ఎఫ్2లాగా సూపర్ హిట్ కొట్టాలని కష్టపడ్డారు. ఎఫ్2ను ఆడియెన్స్ ఎలాగైతే ఎంజాయ్ చేశారో, అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బిగ్ హిట్ కాబోతుంది. అలా రెండు సినిమాలతో ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. తెలుగు ప్రేక్షకులు మా సినిమాలను సక్సెస్‌ఫుల్‌గా మరో లెవల్‌లో ఉంచుతారు. నెక్ట్స్ చేయబోయే సినిమాలను చాలా జాగ్రత్తగా చేయాలని ప్రయత్నిస్తున్నాను అని దిల్ రాజు అన్నారు.