నాగార్జున , ధనుష్ , రష్మిక కాంబోలో జీనియస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కుబేరా’. గతవారం థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మొదటి షో నుండి పాజిటివ్ టాక్‌తో రన్ అవుతూ అంచనాలను మించి వసూళ్ళను సాధిస్తోంది. విడుదల కాగానే మూవీ అదిరిపోయిందని, అసలు ఇలాంటి సినిమాను ఎక్స్పర్ట్ చేయలేదంటూ ప్రేక్షకులు ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ములను ఆకాశానికెత్తేస్తున్నారు. వర్కింగ్ డేస్‌లోనూ తన దూకుడును కొనసాగిస్తూ సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఒక మెగా బ్లాక్‌బస్టర్‌గా అవతరిస్తున్న ‘కుబేర’ తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న.
Also Read : Raw Garlic : ఈ సమస్యలతో బాధపడేవారు.. ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే డాక్టర్‌తో పని లేదు !
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ చిత్రంగా నిలవడంతో ధనుష్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఆయన నటించిన రెండో సినిమా కూడా సక్సెస్ కావడంతో ధనుష్ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ‘కుబేర’ తర్వాత ధనుష్ నెక్స్ట్ తెలుగు చిత్రం ఎవరితో చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ఇప్పటికే ధనుష్ తన తొలి తెలుగు చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరికి మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2027 లో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ‘సార్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన వెంకీ అట్లూరితో మరోసారి ధనుష్ చేతులు కలపడంతో అప్పుడే ఈ ప్రాజెక్ట్‌పై బజ్ క్రియేట్ అవుతుంది.