మృణాల్ ఠాకూర్, ధనుష్ ప్రేమలో ఉన్నట్టుగా గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఇప్పుడు మరింత ఊతం ఇచ్చే విషయం ఒకటి తెర మీదకు వచ్చింది. నిజానికి హీరో హీరోయిన్లు కాస్త క్లోజ్ గా కనిపించినా వారి మధ్య ఏదో ఉందని వార్తలు వండి వడ్డించడం సర్వసాధారణం. ధనుష్ మృనాల్ విషయంలో కూడా అదే జరిగిందేమో అని అందరూ అనుకున్నారు.. కాబట్టి ఆ వార్తలు వచ్చినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు వేడుకలకు ధనుష్ వెళ్లడంతో ఈ ఊహగానాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. అయితే అది పెద్ద విషయం ఏమీ కాకపోవడంతో చాలామంది లైట్ తీసుకున్నారు.
Also Read : Manchu Lakshmi : మంచు లక్ష్మీ యాసపై బన్నీ కూతురు సెటైర్లు..
అయితే, ఇటీవల మృణాళ్ ఠాకూర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పని ఆ పుకార్లకి మరింత ఊతం ఇచ్చింది. మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ధనుష్ అక్కలు డాక్టర్ కార్తీక కార్తీక్, విమల గీతలను ఫాలో అవడమొదలు పెట్టింది. ధనుష్ అక్కలు కూడా ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అభిమానులు అబ్జర్వ్ చేయడంతో అది తెరమీదకు వచ్చింది. సాధారణంగా నటీనటులు ఒకరినొకరు అనుసరించడం చాలా కామన్ అయినప్పటికీ, ధనుష్ అక్కలను ఫాలో అవ్వడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ఫాలోయింగ్ వ్యవహారం ధనుష్ ఆమెను ఇప్పటికే తన కుటుంబానికి పరిచయం చేసి ఉండవచ్చని చాలామంది నమ్మేలా చేసింది. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే ధనుష్, మృణాళ్ ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్‌లోనూ కలిసి పని చేయలేదు.