పొంగల్ దంగల్ నుండి సడెన్లీ తప్పుకున్నాడు అజిత్. లీగల్ ఇష్యూస్, సెటిల్ మెంట్ కారణాలతో రిలీజ్ వాయిదా పడి గేమ్ ఛేంజర్‌కు లైన్ క్లియర్ చేస్తే.. ధనుష్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. సంక్రాంతి రేసు నుండి సైడైన విదాముయర్చి ఇష్యూ సాల్వ్ కావడంతో ఫిబ్రవరిలో సినిమా దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగానే బజ్ నడుస్తుంది. ఇదే మారి హీరోను కలరపెడుతోంది. ఇప్పటికే ఫిబ్రవరిలో కర్చీఫ్ వేసుకున్న ధనుష్ సినిమాలను కష్టాల్లో నెట్టినట్లయ్యింది.
Also Read : Daaku Maharaaj : తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో డాకు మహారాజ్ రిలీజ్
మేనల్లుడు పవీష్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసే రెస్పాన్సిబులిటీని షోల్డర్స్ పై వేసుకున్నాడు ధనుష్. నిర్మాత కమ్ దర్శకుడిగా మారి నిలవుకు ఎన్మేల్ ఎన్నడి గోబం తీసుకు వస్తున్నాడు. యూత్ ఫుల్,రొమాంటిక్ కామెడీగా వస్తున్న నీక్. వాలంటైన్స్ డే వీక్ ను టార్గెట్ చేస్తూ ఫిబ్రవరి 7న థియేటర్లలోకి తీసుకు వస్తున్నాడు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్న ఈ పిక్చర్ లో అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాధ్యూ థామస్ మెయిన్ లీడ్స్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మోస్ట్ ఎగ్జైంటీ మూవీ కుబేర కూడా ఫిబ్రవరిలో తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున కీ రోల్ చేస్తోన్న ఈ సినిమాను ఫిబ్రవరి 21 లేదా థర్డ్ వీక్‌లో థియేటర్లలోకి దింపేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ప్రజెంట్ ఈ రెండు చిత్రాలు ధనుష్‌కు అత్యంత కీలకం. అల్లుడ్ని హీరోగా నిలబెట్టడంతో పాటు.. కుబేర పాన్ ఇండియన్ మూవీతో మరింత స్టార్ డమ్ తెచ్చుకోవడం. కానీ ఇదే ఫిబ్రవరిలో విదాముయర్చి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం థియేటర్ల ఇష్యూతో పాటు కలెక్షన్లపై ఎఫెక్ట్స్ పడే అవకాశాలున్న నేపథ్యంలో ధనుష్ సిచ్యుయేషన్ ఆగమ్యగోచరంగా మారింది.