కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ యూఎస్ నుంచి తిరిగొచ్చారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ధనుష్ కన్పించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో తెల్లటి మాస్క్, సాధారణ దుస్తులు ధరించి కన్పిస్తున్నారు ధనుష్. నెట్‌ఫ్లిక్స్ రూపొందిస్తున్న “ది గ్రే మ్యాన్” షూటింగ్ కోసం ధనుష్ దాదాపు నాలుగు నెలలు యూఎస్‌లో ఉన్నారు. జూన్ 30న హైదరాబాద్ తిరిగొచ్చిన ధనుష్ తరువాత తన నెక్స్ట్ మూవీ. ధనుష్ తరువాత ప్రాజెక్ట్ ‘D43’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనుంది. ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొనడానికి ధనుష్ ఇంటికి కూడా వెళ్లకుండా నేరుగా హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు.
Read Also : నోరా ఫతేహి హాట్ డ్యాన్స్… వీడియో వైరల్
కార్తీక్ నరేన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘D43’ తుది షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇందులో సముతిరకని, స్మృతి వెంకట్, మాస్టర్ మహేంద్రన్, కృష్ణ కుమార్, జయ ప్రకాష్ కూడా నటిస్తున్నారు. ‘D43’ మొదటి రెండు షెడ్యూల్లను హైదరాబాద్ లో చిత్రీకరించారు. ఇక ‘D43’ ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి రానుంది అంటున్నారు.