నేషనల్ అవార్డ్ సాధించిన ‘కలర్ ఫోటో’, బ్లాక్‌బస్టర్ హిట్ ‘బెదురులంక 2012’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసులను కట్టిపడేసిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాణంలో కొత్త చిత్రం ‘దండోరా’ రూపొందుతోంది. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేగంగా చిత్రీకరణ దశలో ముందుకు సాగుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఈ చిత్రం, తాజాగా రెండో షెడ్యూల్‌ను ప్రారంభించింది. 25 రోజుల పాటు నిరంతరంగా జరిగే ఈ షెడ్యూల్‌లో ప్రముఖ నటుడు శివాజీ పాల్గొననున్నారు. ‘నైంటీస్’, ‘కోర్ట్’ వంటి వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటుడు, ‘దండోరా’లో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు.
Petrol price: ప్రజలపై భారం ఉండదు.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
ఇటీవల విడుదలైన ఫస్ట్ బీట్ వీడియోకు అద్భుతమైన స్పందన లభించింది. అగ్ర వర్గాలకు చెందిన యువతులను ప్రేమించి వివాహం చేసుకోవడం లేదా వారికి వ్యతిరేకంగా నిలబడటం వల్ల సమాజంలో జరిగే దౌర్జన్యాలను కథాంశంగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం, పురాతన ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, వ్యంగ్యం, హాస్యం, హృదయాన్ని తాకే భావోద్వేగాల సమ్మేళనంగా రూపుదిద్దుకుంటోంది. శివాజీతో పాటు నవదీప్, నందు, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ప్రఖ్యాత సంగీత దర్శకుడు మార్క్ కె. రాబిన్ సంగీతం అందిస్తుండగా, వెంకట్ ఆర్. శాఖమూరి సినిమాటోగ్రాఫర్‌గా, గ్యారీ బి.హెచ్ ఎడిటర్‌గా, క్రాంతి ప్రియం ఆర్ట్ డైరెక్టర్‌గా, రేఖ బొగ్గారపు కాస్ట్యూమ్ డిజైనర్‌గా, ఎడ్వర్డ్ స్టీవ్‌సన్ పెరెజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, అనీష్ మరిశెట్టి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం వెల్లడించనుందని తెలిపారు.