యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర తెల్లవారుజామున 1.08 గంటల ఆటతో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అటు ఓవర్సీస్ లోను దేవర భారీ ఎత్తున విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోను చాలా కాలం తర్వాత ట్ బెన్ ఫిట్ షోస్ ప్రదర్శించారు. అయితే ఆంధ్రలోని కడప నగరంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర ఫ్యాన్స్ షో కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. నగరంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న రాజా థియేటర్ లో అర్ధరాత్రి దేవర ఫ్యాన్స్ షో వేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఎలాగైనా తమ హీరో సీనియాను అందరికంటే ముందుగా చూడాలని రాజ్ థియేటర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.
Also Read : Devara : రాజమౌళి సెంటిమెంట్ కు బ్రేక్.. కొరటాల ఈజ్ బ్యాక్..?
వీరిలో చాలామంది టిక్కెట్లు లేకుండా థియేటర్ లోపలికి ప్రవేశించడంతో రాజ్ థియేటర్ పూర్తిగా నిండిపోయింది. ప్రేక్షకులు కూర్చునేందుకు సీట్లు లేకపోవడంతో సీట్ల విషయమై వివాదం రేగింది. ఈ క్రమంలో స్క్రీన్ ముందు చాలామంది యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో కొంత మంది యువకులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి టికెట్ లేని వారిని బయటికి పంపించడంతో వివాదం సద్దుమణిగింది. యువకులు చేసిన హంగామా తో సినిమా చూడటానికి వచ్చిన సామాన్య ప్రేక్షకులు బెంబేలెత్తిపోయారు. యువకుల తీరుతో షో ఆలస్యంగా నడవడమే కాకుండా అర్ధాంతరంగా మధ్యలోనే షోను కాసేపు నిలిపివేసింది థియేటర్ యాజమాన్యం. సినిమా అనేది వినోదం కోసం మాత్రమే చూడాలని అంతేగాని ఇలా గొడవలు చేసుకోవదానికి కాదని పోలీసులు ఫ్యాన్స్ కు సూచన చేశారు.