Devara Songs Getting Trolled first: అదేందో గానీ.. ఒక్కోసారి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చూస్తే.. నిజమే కదా? అని అనిపించక మానదు. దేవర సినిమా విషయంలో అనిరుధ్ పై వస్తున్న కామెంట్స్ చూస్తే.. అనిరుద్దుడు అనేది ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంది. ఫియర్ సాంగ్ నుంచి మొదలైన ఈ కామెంట్.. లేటెస్ట్‌గా వచ్చిన దావుది సాంగ్ వరకు వినిపిస్తునే ఉంది. కానీ ఫైనల్‌గా.. దేవరకు మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. ముందుగా పాట బాగాలేదంటూ ట్రోల్ చేస్తారు, కానీ ఆ తర్వాత రీల్స్, హుక్ స్టెప్పులు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌తో అదే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అందుకు నిదర్శనం చుట్టమల్లె సాంగ్ అనే చెప్పాలి. ఈ పాట రిలీజ్ అయినప్పుడు ఓ శ్రీలంక సాంగ్‌కు కాపీ అని తెగ ట్రోల్ చేశారు. కానీ ఏకంగా.. 100 మిలియన్స్ వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇంతకుముందు వచ్చిన ఫియర్ సాంగ్ తీసుకుంటే.. అనిరుధ్ డామినేషన్ ఎక్కువైంది. పాటలో ఎన్టీఆర్ కంటే అనిరుద్దే ఎక్కువగా కనిపించాడు. పాట కూడా కాస్త గజిబిజీగా ఉండడంతో.. విమర్శలు వచ్చాయి.
Sai Pallavi Sister: సాయి పల్లవి చెల్లి పెళ్లి.. ఫోటోలు వైరల్
ఇక ఇప్పుడు మాస్ బీట్ అని టైగర్ ఫ్యాన్స్ కాస్త కష్టంగానే.. దావూదీ పాటను రిసీవ్ చేసుకుంటున్నట్టుగా ఉంది వ్వవహారం. పాట సెటప్, ఎన్టీఆర్ స్టెప్పులు, జాన్వీ గ్లామర్ ఓకే కానీ.. అనిరుధ్ మాత్రం తన పాటను తనే కాపీ కొట్టినట్టుగా కామెంట్స్ వస్తున్నాయి. గతంలో విజయ్ ‘బీస్ట్’ సినిమాలోని ‘హలమితి హబిబో’ సాంగ్‌నే.. అనిరుధ్ దేవరలో దించేశాడని అంటున్నారు. ట్యూనే కాదు.. హలమితి పాటకు దావుది స్టెప్పులను యాడ్ చేస్తే.. ఏది ఒరిజినలో తేల్చుకోకుండా ఉందంటున్నారు. స్టెప్పులు కూడా హలమితి హబిబో లాగే ఉన్నాయని.. కొందరు ట్రోల్ చేస్తున్నారు. కానీ ఈ పాట మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. రిలీజ్ అయినప్పటి నుంచి.. ఇండియా వైడ్ నెంబర్ 1 ట్రెండింగ్‌లో ఉంటూ.. మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. కాబట్టి.. ముందు నెగెటివ్‌గా ట్రెండ్ అయినా.. ఈ సాంగ్ కూడా హిట్టే అని చెప్పాలి. కానీ.. అనిరుద్దుడు అనే కామెంట్‌కు చెక్ పడాలంటే.. దేవర నుంచి ఒక సాలిడ్ ఫ్రెష్ సాంగ్ బయటకు రావాల్సిందే.