Devara Second Single to Release on August 5th: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆకలి మీద ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ తర్వాత దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా ఎన్టీఆర్ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర పార్ట్ వన్ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టి చాలా కాలమే అవుతుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన మొట్టమొదటి ఫియర్ సాంగ్ ప్రేక్షకుల్లోకి గట్టిగానే వెళ్ళింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ ఆగస్టు 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.
Bigg Boss Telugu 8 Teaser: ఇక్కడ ఒక్కసారి కమిటైతే లిమిటే లేదు!
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక అనేకమంది స్టార్ నటీనటులు భాగమవుతున్న ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. ఆచార్య ఎఫెక్ట్తో ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాని కళ్యాణ్ రామ్ బావమరిది కొసరాజు హరికృష్ణతో కలిసి కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ సాంగ్ షూట్ లో హీరోయిన్ జాన్వి కపూర్ కూడా పాల్గొంటుంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన మొదటి సాంగ్ కి మిశ్రమ స్పందన వచ్చినా ఈ సెకండ్ సింగిల్ ఎలా ఉండబోతుందనేది రిలీజ్ అయితే కానీ చెప్పలేం.