Devara Day 1 Collections: డే 1.. దేవర విధ్వంసం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara First Day Collections: ఏ హీరో అయినా సరే.. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్ చూడాల్సిందే. రాజమౌళి హీరోలకు ఇదొక బ్యాడ్ సెంటిమెంట్‌గా మారిపోయింది. కానీ దేవర సినిమాతో సెంటిమెంట్ బ్రేక్ చేశాడు యంగ్ టైగర్. దీంతో.. తనతోనే మొదలైన సెంటిమెంట్‌ను తనే బ్రేక్ చేశాడు.. టైగర్ వన్ మ్యాన్ షో చేశాడు.. కొరటాల సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు.. అంటూ దేవర సక్సెస్‌ను ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. మరోవైపు దేవర బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ఊచకోత కోస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే అదరగొట్టిన దేవర.. ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా.. ఇండియాలో తొలి రోజు 83.71 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ ఇచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 54 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. గ్రాస్ వచ్చేసి వరల్డ్ వైడ్‌గా 154.36 కోట్ల వరకు వచ్చినట్టుగా అంచనాలు ఉన్నాయి.
Balakrishna: బాలయ్య కాళ్ళు మొక్కిన ఐష్
Also Read
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
- Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
దీంతో సోలోగా ఎన్టీఆర్ కెరీర్లో ఫస్ట్ వంద కోట్ల ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా దేవర నిలిచింది. అలాగే.. 2024లో డే వన్ సెకండ్ హైయెస్ట్ గ్రాసర్‌గా దేవర నిలిచింది. ఏపీ తెలంగాణ తొలిరోజు 83.71 కోట్లు, కర్ణాటక 10.03 కోట్లు, తమిళనాడు 2.59 కోట్లు, కేరళ 64 లక్షలు, మిగతా ఇండియా అంతా కలిపి 9.27 కోట్లు, ఓవర్ సీస్ 48.12 కోట్లు(ఇంకా రిపోర్ట్ చేయని లొకేషన్స్ కొన్ని ఉన్నాయి. అయితే ఫైనల్ గా సినిమా యూనిట్ 172 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ప్రకటించింది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ముందు నుంచి భారీ హైప్ ఉంది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నుంచి సోలోగా వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే రిలీజ్‌కు ముందే సంచలనం సృష్టించిన దేవర.. రిలీజ్ అయ్యాక భారీ వసూళ్లను కొల్లగొట్టింది. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్‌గా సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించిన ఈ సినిమాలో.. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. మరి లాంగ్ రన్‌లో దేవర ఎంత రాబడుతుందో చూడాలి.
No force can hold back the TSUNAMI OF #DEVARA 🔥#BlockbusterDEVARA pic.twitter.com/oGhYIZ0TuG
— Devara (@DevaraMovie) September 28, 2024
తాజావార్తలు
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!