జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవర. అత్యంత భారీ బడ్జెట్ లో ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్ ఇప్పటి వరకు 55 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. దేవర తెలుగు రాష్టాల థియేట్రికల్ రైట్స్ ను నాగవంశీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read : Maruthi : భలే ఉన్నాడే డెఫినెట్ గా డిసప్పాయింట్ చేయదు : దర్శకుడు మారుతీ
కాగా దేవర ఒవర్సీస్ అడ్వాన్స్ బుక్కింగ్స్ జోరు కొనసాగుతుంది. ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ కలెక్షన్స్ ఒకసారి గమనిస్తే 408 లొకేషన్స్ లో 1197 షోస్ కి గాను $1,040,292 డాలర్స్ కొల్లగొట్టింది. ఇక టికెట్స్ పరంగా చూస్తే 35016 టికెట్స్ బుక్ అయ్యి రికార్డ్స్ క్రియేట్ చేసింది దేవర. రిలీజ్ కు 15 రోజులు ఉండగానే 1 మిలియన్ దాటేసిన దేవర రిలీజ్ నాటికి 3మిలియన్ మార్క్ అందుకుంటాడని అంచనా. ఈ మంగళవారం సెన్సార్ కార్యక్రమాలు ముగించిన దేవరకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. టోటల్ 2 గంటల 57 నిమిషాల రన్ టైమ్ తో వస్తోన్న ఈ సినిమా సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలిని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.