దేవర.. RRR వంటి సూపర్ సక్సెస్ తర్వాత తారక్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటినుండి ట్రోలింగ్ జరుగుతునే ఉంది. ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయినప్పుడు మోస్తారులో నెగిటివ్ ట్రెండ్ జరిగింది. తాజాగా దేవర నుండి రెండు రోజుల క్రితం సెకండ్ సాంగే రిలీజ్ అయింది. చుట్టమల్లే అంటూ వచ్చిన ఈ రొమాంటిక్ సాంగ్ విజువల్స్, లిరిక్స్, తారక్, జాన్వీల కెమిస్ట్రీ అద్భతంగా ఉందనే చెప్పాలు.
Also Read: OTT: ఈ వారంలో ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..
కానీ మ్యూజిక్ పరంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది దేవర సెకండ్ సింగిల్ . దీంతో సోషల్ మీడియాలో దేవర సాంగ్ ను యాంటీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆడుకున్నారు. సెకండ్ సింగిల్ లోని మ్యూజిక్ శ్రీలంకన్ మ్యూజిషియన్. కంపోజ్ చేసిన సాంగ్ ను పోలి ఉందని ట్రోలర్స్ రెండు వీడియోలను పోలుస్తూ నెట్టింట ట్రోలింగ్ తార స్థాయిలో చేసారు. ఇంత జరుగుతున్నా కూడా తారక్ ఫ్యాన్స్ నుండి ట్రోలింగ్ కు అడ్డుకట్ట వేసేవారు లేరు. ఈ మధ్య కాలంలో ఒక సాంగ్ పై ఇంత నెగిటివిటి రాలేదంటే అర్ధం చేసుకోవచ్చు ట్రోలింగ్ ఏ స్థాయిలో జరిగిందో . కాగా తారక్ ఫ్యాన్స్ మధ్య విభేదాలు ఉన్నాయని, కష్టపడిన వారిని దూరం పెట్టి, ఎవరినో తెచ్చి అందలం ఎక్కించారని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అందుకే ఎవరికి వారు పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే డిష్కషన్ నెట్టింట్లో జరుగుతుంది. ఆ మధ్య మహేశ్, తారక్ అభిమానుల మధ్య ఇటువంటి వాతవరణం ఉండగా ఇద్దరూ కలిసి ఒకే వేదికపై వచ్చి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. మరి ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ లో మెుదలైన ఈ వివాదాన్ని తారక్ ఎలా పరిష్కరిస్తాడో దేవరను ట్రోలింగ్ నుండి ఎలా తప్పిస్తారో చూడాలి