పుష్యం ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణ రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం దేవగుడి. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ కనికే డిఓపిగా పనిచేయగా షేక్ మదీన్ సంగీతాన్ని అందించారు. నాగిరెడ్డి ఎడిటింగ్ చేశారు. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించగా పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఆంధ్రప్రదేశ్ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదగా మీడియా సమక్షంలో లాంచ్ చేయడం జరిగింది.
Also Read :Pawan Kalyan : చిరంజీవి జన్మతః ఓ ఫైటర్.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్
ఈ సందర్భంగా ఆది నారాయణరెడ్డి మాట్లాడుతూ… “మా ఊరు పేరుతో ఈ సినిమా టైటిల్ పెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ సినిమాకు ఎన్నో బాధ్యతలు వహించి ప్రేక్షకులకు తీసుకొస్తున్న రామకృష్ణారెడ్డి గారికి ఈ సినిమా ద్వారా మంచి విజయ సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులకు మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా సినిమాలు ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ఈ చిత్ర టైటిల్ ప్రత్యేకతను వివరిస్తూ ముగించారు.