Demonte Colony2: వామ్మో..వణికిస్తున్న “డీమాంటీ కాలనీ 2” ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Demonte Colony 2 Telulgu Release Trailer : తమిళ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ డిమాంటీ కాలనీకి సీక్వెల్ గా రూపొందిన సినిమా డిమాంటీ కాలనీ 2. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవాని శంకర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను రాజ్ వర్మ ఎంటర్ టైన్మెంట్ మరియు శ్రీ బాలాజీ ఫిలింస్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు రూపొందించిన డిమాంటీ కాలనీ 2 సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటూ ఆర్జీవీ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక డిమాంటీ కాలనీ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – డీమాంటి ఇంట్లో అనూహ్యమైన ఘటనలు జరుగుతుంటాయి.
Kalki 2898 AD: ఆర్ఆర్ఆర్ రికార్డ్ దిశగా కల్కి పరుగులు
Also Read
ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన చైన్ తిరిగి ఆ ఇంటికి ఎలాగోలా చేరుతుంటుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వెళ్లిన వారు చనిపోతుంటారు. ఓ సందర్భంలో ప్రధాన పాత్రధారులంతా ఆ ఇంట్లోకి వెళ్తారు. వారికి అక్కడ నమ్మలేని, భయంకర ఘటనలు ఎదురవుతాయి. డీమాంటి ఇంట్లో ఉన్న ఆ శక్తి ఏంటి, దాని నుంచి ఎలా ప్రాణాలు కాపాడుకున్నారు అనేది ట్రైలర్ లో గూస్ బంప్స్ తెప్పించేలా చూపించారు దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్, అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవింద్ రాజన్, సర్జనో ఖాలిద్, అర్చన రవిచంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి హరీశ్ కన్నన్ సినిమాటోగ్రఫీ . విజయసుబ్రహ్మణ్యన్, ఆర్.సి.రాజ్ కుమార్ నిర్మాతలుగా బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి సహ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కింది.
తాజావార్తలు
-
CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
-
Internet Crisis: ఇంటర్నెట్‌కు హోర్ముజ్ సెగలు.. భారత్‌కు ముప్పు తప్పదా?
-
Yogibabu : సత్య – యోగి బాబు నవ్వుల బాంబ్..’రంగబలి’ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
-
Petrol-Diesel Prices: పెట్రోల్-డీజిల్ ధరల పెంపునకు రంగం సిద్ధం.. ఈ సాయంత్రం షాకిచ్చే అవకాశం!
-
Nara Rohit: కొత్త సినిమా మొదలెట్టిన నారా రోహిత్
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?