బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రజంట్ దీపిక ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకొని, భాషల మధ్య తేడాలు లేకుండా అన్ని రంగాల్లో నటించాలనే లక్ష్యం తో దూసుకుపోతోంది. అయితే తాజాగా ఆమె దృష్టిని టాలీవుడ్ వైపుకు మళ్లించింది. ఇప్పటికే ‘కల్కి 2898 ఏ.డి’ సినిమాలో ప్రభాస్‌తో కలిసి పనిచేస్తున్న ఆమె, మరోవైపు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో కూడా ఒక భారీ సినిమా చేయబోతున్నారు.
Also Read : Rashi : కమ్‌బ్యాక్ పై రాశి వైరల్ కామెంట్స్..
ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా తెలుగు తెరకు బలమైన ఎంట్రీ ఇవ్వనున్న దీపిక, ఇకపై టాలీవుడ్‌ని పూర్తిగా కవర్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నాకు టాలీవుడ్ నటులంటే ఎంతో ఇష్టం. ప్రత్యేకంగా చపాలి అంటే, మహేష్‌బాబు, ఎన్టీఆర్ ఎంతో గొప్ప నటులు. వాళ్లిద్దరితో కలిసి నటించాలని ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో కూడా ఓ షోలో టాలీవుడ్లో మీకు ఎవరు తెలుసు? అని అడిగితే ‘మహేష్ బాబు గురించి తెలుసు’ అంటూ మాత్రమే సమాధానం ఇచ్చిన దీపిక, ఇప్పుడు మహేష్‌తో పాటు ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడం విశేషం. నెటిజన్లు దీనిపై వివిధ కోణాల్లో స్పందిస్తున్నారు. ‘ముందు తెలుగు వాళ్ళు ఎవరో కూడా తెలీని ఆమె.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించాలని ఉందంటూ ప్రయత్నాలు చేస్తుండడం ఆశ్చర్యమే’ అంటున్నారు.