దీపికా పదుకొనే, ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమాతో పాటు కల్కి సెకండ్ పార్ట్ నుంచి కూడా హీరోయిన్‌గా తప్పుకుంది. ఆమెను తొలగించినట్లుగా నిర్మాణ సంస్థలు ప్రకటించాయి, కానీ ఆమె తప్పుకుందా, తప్పించారా అనే విషయం మీద ఎన్నో డిబేట్స్ జరిగాయి. అయితే, తాజాగా ఈ అంశం మీద ఆమె ఓపెన్ అయినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఒక మీడియా హౌస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన ప్రయారిటీస్ ఇప్పుడు మారాయని చెప్పుకొచ్చింది. తనకు కీర్తి గురించి కానీ, డబ్బు గురించి కానీ ఎలాంటి ఆశ లేదని ఆమె చెప్పుకొచ్చింది. అందుకే తాను ఇప్పుడు అర్థవంతమైన సినిమాలతో పాటు, ఆరోగ్యవంతమైన కండిషన్స్‌లో షూటింగ్‌కి వెళ్లడానికి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నానని చెప్పుకొచ్చింది.
Also Read : Spirit: ప్రభాస్ లుక్ లాక్.. ఇక కాస్కోండి!
అంతేకాక, ఆమె మాట్లాడుతూ తనకు ఈ సినిమాల విషయంలో ఎలాంటి క్రియేటివ్ డిఫరెన్స్ లేదని, తనకు ఇచ్చే ట్రీట్‌మెంట్ విషయంలో, వర్క్ అవర్స్ విషయంలో మాత్రమే ఇబ్బంది ఎదురైనట్లు ఆమె చెప్పుకొచ్చింది. నిజానికి, దీపికా పదుకొనే సినిమాల్లో రెమ్యూనరేషన్‌తో పాటు హీరోలకు ఇచ్చినట్లు రెవెన్యూ షేర్ కూడా ఇవ్వాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి. అంతేకాక, తాను రోజుకు 8 గంటల మాత్రమే పనిచేస్తానని ఒక వర్క్ షెడ్యూల్ కూడా ఆమె ఫిక్స్ చేయడానికి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమెతో సినిమాలు చేయలేమని సందీప్ రెడ్డి వంగాతో పాటుగా కల్కి టీమ్ కూడా నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.