Dandora Song : సామాజిక అసమానతలను ప్రశ్నించేలా ‘దండోరా’ టైటిల్ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘దండోరా…’ మూవీ టైటిల్ సాంగ్‌ను మేకర్స్ శనివారం విడుదల చేశారు. మార్క్ కె రాబిన్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమాలోని, ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. ఆంథోని దాసన్, మార్క్ కె.రాబిన్ పాటను పాడారు. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజల బాధలను తెలియజేసేలా సాగే ఈ పాట చాలా ఎమోషనల్‌గా, హార్ట్ టచింగ్‌గా ఉంది. తరాలు మారుతున్నాయి. చంద్రుడిపైకి మనిషి అడుగు పెట్టిన ఎన్నో ఏళ్లవుతుంది. అయినా కూడా ఈ అసమానతలు మాత్రం తగ్గటం లేదనేది ఈ పాటలోని భావం. వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు పాత్రధారులు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read :Venky Kudumula: నిర్మాతగా మరో దర్శకుడు
Also Read
- Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
- Janhvi Kapoor : పా. రంజిత్ పర్యవేక్షణలో కోలీవుడ్‌కి జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీ
- Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
- Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
దండోరా సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో ఆడియెన్స్‌ను అలరించటానికి సిద్ధమవుతోంది. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దండోరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. టీజర్‌తో దర్శకుడు బలమైన అంశాన్ని చెప్పాలనకుంటున్నాడనే విషయం తెలుస్తుంది. డిఫరెంట్ ప్రమోషనల్ ప్లానింగ్ స్ట్రాటజీతో ‘దండోరా’ మూవీపై స్టార్టింగ్ నుంచే బజ్ క్రియేట్ అయ్యింది. దీంతో సినిమా రిలీజ్ కంటే ముందే బిజినెస్ పూర్తి కావటం విశేషం. ఈ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తుంటే.. ఆంధ్ర, సీడెడ్, కర్ణాటక ఏరియాల్లో ప్రైమ్ షో రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్లో అయితే డిసెంబర్ 23నే ప్రీమియర్స్ పడుతున్నాయి. ఈ సినిమాలోని పాటలు టి సిరీస్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
-
Independence Day TV Offers: బంపరాఫర్.. రూ.11,990కే స్మార్ట్ టీవీ..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
-
Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!