ప్రముఖ నేషనల్ అవార్డు విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ లీలాధర్ సావంత్ తన 25 సంవత్సరాల జీవితాన్ని సినీ పరిశ్రమకే అంకితం చేశారు. రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన తన కెరీర్లో అనేక దిగ్గజ బాలీవుడ్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. ‘దీవానే’, ‘జిడ్డీ’, ‘మై ఖిలారి తు అనారి’ సహా మొత్తం 177 చిత్రాలకు పనిచేశారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడాయన కష్ట పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం అతను తన భార్య పుష్పా సావంత్‌తో కలిసి మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఉన్న జౌల్కా అనే గ్రామంలో నివసిస్తున్నాడు. ఇటీవల ఆయన భార్య మాట్లాడుతూ ప్రస్తుతం వారు తీవ్ర ఆర్ధిక కష్టాల్లో ఉన్నట్లు వెల్లడించారు.
Read Also : ప్రెగ్నెన్సీ రూమర్స్ పై చిన్మయి రియాక్షన్
లీలాధర్ సావంత్ కు జరిగిన రెండు బైపాస్ సర్జరీలు, మెదడు సంబంధిత ఆపరేషన్ల కోసం దాచుకున్న సేవింగ్స్ మొత్తం అయిపోయాయని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నటీనటులెవరైనా తమకు ఆర్ధిక సహాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. తమకు ఒక పెళ్ళైన కూతురు ఉందని, కొన్ని నెలల క్రితమే క్యాన్సర్ తో పోరాడి తమ కొడుకు కన్నుమూశాడని ఆవేదన వ్యక్తం చేశారు. లీలాధర్ సావంత్ సినీ పరిశ్రమకు చేసిన కృషికిగానూ అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవింపబడ్డారు. మరి వీరికి బాలీవుడ్ దిగ్గజాలెవరైనా ఆర్ధిక సహాయం అందిస్తారేమో చూడాలి.