Santosh Sobhan : మరో లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యువ హీరో సంతోష్ శోభన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. తమిళ దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. మిగతా సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ, ఈ సినిమాలోని స్వచ్ఛమైన ప్రేమకథ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా బాగా మెప్పిస్తోంది.
Also Read : Raashii Khanna: మహాశివరాత్రికి రాశీఖన్నా ప్రత్యేక కానుక..
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ఇక ఈ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇచ్చారు. సంతోష్ శోభన్ – మానస వారణాసి కెమిస్ట్రీకి వస్తున్న రెస్పాన్స్ చూసి, ఇదే జోడీతో మరో ప్రేమకథా చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతే కాదు.. ఈ కొత్త సినిమాను కూడా వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే (2027) సందర్భంగా విడుదల చేయనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ తో కలిసి తాను ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు ధీరజ్ తెలిపారు. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉంచారు. వరుసగా రెండో ఏడాది కూడా అదే డేట్‌కి, అదే జోడీతో రాబోతుండటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరి వచ్చే ఏడాది రాబోయే సినిమా కూడా ఇదే రేంజ్ లో హిట్ అవుతుందేమో చూడాలి!
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!