రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు డైరెక్షన్‌లో రూపొందిన కూలీ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజే 150 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మొదటి నాలుగు రోజులకు గానూ 404 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమాలకు రికార్డు క్రియేటర్ రజనీకాంత్‌ని, వాటిని బ్రేక్ చేసే రికార్డు బ్రేకర్ కూడా ఆయనే అని చెప్పుకొచ్చింది. ఇక కూలీ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించారు.
Also Read:Film Federation: చర్చలకు పిలిపు.. నిరసన తాత్కాలిక నిలుపుదల..
వీరితో పాటు శృతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, రచితా రామ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. నిజానికి ఈ సినిమాకి ఏకపక్షంగా పాజిటివ్ టాక్ అయితే రాలేదు. సినిమా బాగుందని కొందరు, బాగోలేదని కొందరు కామెంట్ చేస్తూ వచ్చారు. మిశ్రమ స్పందనతో ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టడం మామూలు విషయం కాదనే చెప్పాలి. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో ఏషియన్ సునీల్, సురేష్ బాబు, దిల్ రాజు సంయుక్తంగా ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ ద్వారా రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు సుమారు 45 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ అమౌంట్ తిరిగి రావడం పెద్ద విషయమేమీ కాదనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఓవర్సీస్‌లో కూడా భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది.
