రిలీజ్ కి ఇంకా ఐదు రోజులు సమయం ఉన్నా సరే ఇప్పటి నుంచే పుష్ప 2 సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా సినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. హైదరాబాదులోని పలు థియేటర్లకు ఐదో తారీకు కు సంబంధించిన బుకింగ్ జరుగుతున్నాయి. అయితే ఇదిలా ఉండగా రేపు సాయంత్రం హైదరాబాదులో ఒక ఈవెంట్ నిర్వహించాలని సినిమా టీం నిర్ణయం తీసుకుంది. ముందుగా ఫిక్స్ చేసుకున్న దాని ప్రకారం ఈ ఈవెంట్ హైదరాబాద్ శివార్లలో ఉన్న మల్లారెడ్డి కాలేజీలో చేయాల్సి ఉంది. అయితే చివరి నిమిషం వరకు అక్కడ పర్మిషన్ వస్తుందని భావిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మల్లారెడ్డి కాలేజీలో ఈవెంట్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించేందుకు పర్మిషన్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
OG : హైప్ తో చంపేస్తారా ఏంటీ.. ఓజీలో మరో స్టార్ హీరో..?
ఒకవేళ పర్మిషన్ వస్తే సమయం వృధా కాకుండా ముందు నుంచి వేదిక నిర్మాణం కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అనుమతి లభించడం కష్టమేనని తెలుస్తోంది. కాబట్టి హైదరాబాదులో ఈవెంట్ జరుగుతుందా? జరగదా? అనే విషయం మీద ఇంకా టెన్షన్ వాతావరణం నెలకొంది. రేపటికి కనుక పర్మిషన్ దొరక్కపోతే సోమవారం నాడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే ఆలోచన కూడా ఉంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో రేపు ఈవెంట్ నిర్వహించేందుకే సినిమా టీం ప్రణాళికలు సిద్ధం చేసింది. పర్మిషన్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. పర్మిషన్ దొరికితే రేపు హైదరాబాద్ యూసఫ్ గూడ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతుంది లేదంటే సోమవారం నాడు అక్కడే నిర్వహిస్తారా లేక వేరే ఏదైనా వెన్యూ ఫిక్స్ చేస్తారా అనేది చూడాలి.