Chuttamalle Devara Second Single Lyrics in Telugu: దేవర సినిమా నుంచి సెకండ్ సింగిల్ చుట్టమల్లే అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా సాంగ్లో విజువల్స్ కానీ జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్ రొమాన్స్ కానీ అదిరిపోయింది అంటున్నారు. అలాగే వీరిద్దరి కోఆర్డినేషన్ స్టెప్స్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ సాంగ్ కి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. శిల్పారావు ఆలపించిన ఈ సాంగ్ పల్లవి, చరణాలు ఎలా ఉన్నాయి అనేది మీకోసం అందిస్తున్నాం చూసేయండి.
Devara 2nd Single: అనిరుధ్ భయ్యా.. పాట మామూలుగా లేదు కానీ?
పల్లవి
చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు
ఊరికే ఉండదు కాస్సేపు
అస్తమానం నీ లోకమే నా మైమరపు
చేతనైతే నువ్వే నన్నాపు
రా నా నిద్దర కులాసా నీ కలలకిచ్చేసా
నీ కోసం వయసు వాకిలి కాశా
రా నా ఆశలు పోగేశా నీ గుండెకు అచ్చేసా
నీ రాకకు రంగం సిద్ధం చేశా
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీపేరు పెట్టింది వయ్యారం
ఓణీ కట్టింది గోరింట పెట్టింది
సామికి మొక్కులు కట్టింది
చరణం
మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసన చేరి
వాస్తుగా పెంచానిట్ఠా వందకోట్ల సొగసిరి
ఆస్తిగా అల్లేసుకో కొసరీ కొసరీ
చెయ్యరా ముద్దుల దాడి
ఇష్టమేలే నీ సందడి
ముట్టడించి ముట్టేసుకోలేవ
ఓసారి చెయిజారి
రా ఏ బంగరు నక్లీసు. నా ఒంటికి నచ్చట్లే
నీ కౌగిలితో నను సింగారించు
రా ఏ వెన్నెల జోలాలి నను నిద్దర పుచ్చట్లే
నా తిప్పలు కొంచెం ఆలోచించు
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీపేరు పెట్టింది వయ్యారం
ఓణీ కట్టింది గోరింట పెట్టింది
సామికి మొక్కులు కట్టింది