మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ బాబీ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 2023 వీరి కాంబోలో వచ్చిన వాల్తేర్ వీరయ్య సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి బాబీ డైరెక్షన్ లో చిరు మరో సినిమా చేస్తున్నారు. చిరు కెరీర్ లో 158వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను కన్నడ బడా నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
Also Read : SVC : దిల్ రాజు.. పవన్ కళ్యాణ్.. వంశీ పైడిపల్లి సినిమా ఫిక్స్..
మెగాస్టార్ తో సినిమా కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథ రెడీ చేసాడు బాబీ. అయితే ఈ సినిమాలో చిరుతో పాటు మరొక హీరోకూడా నటిస్తున్నాడు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను మార్కెట్ కలిగి ఉన్న యంగ్ హీరో కార్తీ ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం కార్తీకి భారీ రెమ్యునరేషన్ ఇచ్చారట. విశ్వసనీయ సమాచారం ప్రకారం కార్తీ రూ. 23 కోట్లు ఛార్జ్ చేసాడట. కార్తీ కెరీర్ లోనే తొలిసారి ఇంతటి భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడట కార్తీ. ప్రస్తతం కార్తీ చేస్తున్న వా వాతియార్, సర్దార్ 2 తో పాటు చిరు సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు కార్తీ. అందుకోసం బల్క్ డేట్స్ ఇచ్చాడట కార్తీ. సినిమాటోగ్రాఫర్ గా మరొక యంగ్ డైరెక్టర్ కార్తీక ఘట్టమనేని భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. బాబీతో సినిమా కోసం మరో న్యూ మేకోవర్ లో దర్శనం ఇవ్వబోతున్నాడట చిరు. వాల్తేర్ వీరయ్య తో సూపర్ హిట్ కొట్టిన ఈ కాంబో రాబోయే ఈ సినిమాతో ఎలాంటి రిలీజ్ట్ అందుకుంటారో చూడాలి.