మెగా ఫ్యామిలీకి అభిమానులతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ – చిరంజీవి అన్నదమ్ముల మధ్య కనిపించే బాంధవ్యాన్ని ఒక్క ఫోటోతో నైనా చూసేందుకు మెగా అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా అదే జరిగింది. పవన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. చిరు హాజరైన ఫ్రేమ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Thammudu : ‘తమ్ముడు’ ట్రైలర్ రిలీజ్ .. నితిన్‌కు ఈసారైన హిట్ దక్కేనా..!
ఈ హార్ట్ఫుల్ మూమెంట్ తో మెగా అభిమానులు ఆనందం లో మునిగిపోయారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో, మల్టీస్టారర్ డ్రీమ్‌కు ఫ్యాన్స్ మళ్లీ ఊపు తెచ్చుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్శనలో చిరు, పవన్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ భాగస్వామి రవి శంకర్ కూడా కనిపించారు. మొత్తానికి ఈ ఫోటోతో మరొక్కసారి అభిమానులో హైలైట్ అవుతుంది. మెగా బ్రదర్స్ కలిసి నటించే రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ, ఇలాంటి ఫ్రేమ్స్ మాత్రం వారి బంధాన్ని పదేపదే రిఫ్రెష్ చేస్తూనే ఉంటాయి.
ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. హరీష్ శంకర్ – పవన్ కలయికలో వస్తున్న ఈ రెండో సినిమా ఇది. మొదటిసారి ‘గబ్బర్ సింగ్’ ద్వారా బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఈ కాంబినేషన్ మళ్లీ కలవడంతో మాస్ ప్రేక్షకుల్లో హైప్ తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ మళ్లీ పవన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా, హీరోయిన్‌గా శ్రీలీల కనిపించనుంది.