టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకున్న దర్శకులో అనిల్ రావిపూడి ఒకరు. రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే వీరి మధ్య కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. వైజాగ్ లో అనిల్ రావిపూడి తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కథ గురించి మాట్లాడుకుంటే.. ఇది పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని, ఈ మూవీ షూటింగ్ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని, ఇంతకు ముందు చిరంజీవి పలు ఇంటర్వ్యూలలో ఇప్పటికే చెప్పేశారు. అయితే ఈ సినిమాలో నటీనటుల గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. ఇందులో భాగంగా..
Also Read: Sai Srinivas : ‘కిష్కింధపురి’ ఫస్ట్ లుక్ రిలీజ్.. గ్లింప్స్ కి డెట్ కూడా ఫిక్స్
ఇప్పటికే ఈ మూవీలో స్టార్ హీరోయిన్ నయనతార నటించనున్నట్లు, ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు రాగా. తాజాగా మరో క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి సిస్టర్ రోల్ ఉందని..ఈ పాత్రలో సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించబోతుందని టాక్ నడుస్తోంది. అంతే కాదు ఈ పాత్ర చాలా ఎంటర్టైనింగ్ టోన్‌లో సాగుతుందట.. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకు ముందు చిరు ఇంకా జ్యోతిక ‘ఠాగూర్’ మూవీలో జంటగా నటించారు. అప్పట్లో ఈ జోడికి మంచి మార్కులు కూడా పడ్డాయి. ఇక ప్రజంట్ జ్యోతిక కూడా ఫుల్ ఫామ్‌లో ఉంది.. వరుస సినిమాలు అలాగే పలు హిందీ సిరీస్‌లో కూడా నటిస్తోంది.