సినీనటి కరాటే కళ్యాణి(karate kalyani) దత్తపుత్రిక వివాదంపై అధికారులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ లోని కళ్యాణి నివాసంలో ఆమె తల్లి విజయలక్ష్మి, సోదరుడిని చైల్డ్ లైన్ ప్రొటెక్షన్ స్కీం అధికారులు ప్రశ్నించారు. కరాటే కళ్యాణి అక్రమంగా ఓ పాపను దత్తత తీసుకున్నారంటూ 1098 నంబర్ కు ఫిర్యాదు వచ్చిందని.. అందుకే పోలీసుల సహకారంతో వారిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అధికారులు విచారణ జరుగుతున్న సమయంలో కళ్యాణి ఇంట్లో లేకపోవడంతో ఆమె తల్లి, తమ్ముడిని ప్రశ్నించామన్నారు. నగరంలోనే ఓ దంపతులకు మూడోసారి ఆడ శిశువు జన్మించిందని.. తెలిసిన వ్యక్తుల ద్వారా ఆ పాపను కల్యాణి తెచ్చుకుని పెంచుకుంటోందని ఆమె తల్లి విజయలక్ష్మి అధికారులతో చెప్పారు. పాపను న్యాయబద్ధంగానే దత్తత తీసుకుందని తెలిపారు. గతంలోనూ ఓ బాబును శ్రీకాకుళం నుండి దత్తత తీసుకున్న కళ్యాణి… ఇప్పుడు బాబు వయస్సు 12 సంవత్సరాలని గుర్తించారు. బాబు బందువుల ఇంట్లో ఉన్నట్లు చైల్డ్ లైన్ అధికారులకు తెలియజేశారు కళ్యాణి తల్లి విజయ లక్ష్మి.
కళ్యాణి ఏ విధంగా నెలల మసాలా చిన్నారులను దత్తత తీసుకుంటుంది ఎందుకు తీసుకుంటుంది చైల్డ్ లైన్ అధికారులకు స్పష్టత రాలేదు. చైల్డ్ లైన్ ఆఫీసర్స్ కీ ఇప్పటి వరకు కాంటాక్ట్ లోనికి రాని కళ్యాణి… నిన్న చైల్డ్ లైన్ మరియు పోలీసులు వచ్చిన సమయంలో ఇంట్లో లేదు. నిన్న సంగారెడ్డి టెంపుల్ కి పాపను తీసుకు వెళ్లింది కళ్యాణి. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
యూ ట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి తో ఇటీవలే గొడవ విషయంలో చిన్నారి గాయపడింద ? అనే విషయంపై చైల్డ్ లైన్ అధికారులకు ఇంకా స్పష్టత రాలేదు. కరాటే కళ్యాణి నివాసానికి చిన్నారి దత్తత విషయంలో స్పష్టత కోసం చైల్డ్ లైన్ అధికారులు మరోసారి కళ్యాణి నివాసానికి వెళ్లనున్నారు.
ప్రాథమికంగా చిన్నారినీ కళ్యాణి అక్రమంగా దత్తతకు తీసుకున్నట్లు చైల్డ్ లైన్ అధికారులను ఫిర్యాదు అందటంతో.. నిన్న కరాటే కల్యాణి నివాసంలో అధికారులు విచారించిన విషయం తెలిసిందే..
ఇటీవలే యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డితో కరాటే కళ్యాణి మధ్య వివాదం చర్చనీయాంశమైంది. శ్రీకాంత్రెడ్డి చేసే వీడియోలు అసభ్యంగా ఉండడంతో కరాటే కళ్యాణి అతడిపై దాడి చేసింది. దీంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిన విషయం తెలిసిందే. కాగా.. ఇవాళ మరోసారి కరాటే కళ్యాణి నివాసంలో విచారణ చేపట్టే అధికారులకు ఇంకా ఏ విషయాలు బయటకు వస్తాయో అంటూ ప్రతి ఒక్కరిలో ఉత్కంఠత నెలకొంది.