అల్లు అర్జున్ టీమ్ పై పోలీసు కేసు నమోదు అయింది. సంధ్య థియేటర్ ఘటన పై చిక్కడపల్లి పోలీసుల కేసు నమోదు చేశారు. సెక్షన్ 105,118 BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్న సందర్భం లో భద్రత విషయంలో సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. అల్లు అర్జున్ వస్తున్న విషయం పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా బాధ్యతరాహిత్యంగా వ్యవహరించింది అంటూ అల్లు అర్జున్ టీం పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.. అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 ప్రపంచ వ్యాప్తంగా గురువారం రాత్రి ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది. ఇటు హైదరాబాద్ లో పుష్ప -2 ప్రీమియర్స్ ను భారీగా ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పుష్ప ప్రీమియర్ చూసేందుకు చిత్ర హీరో అల్లు అర్జున్, భార్య స్నేహ తదితరులు సంధ్య థియేటర్ కు గురువారం రాత్రి 9 : 30 గంటల షోకు హాజరయ్యారు.
Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 28 స్పెషల్ ట్రైన్స్..
అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలియడంతో అల్లు అభిమానులు సంధ్య థియేటర్ కు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్ , ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , శాన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్ లో సంధ్య 70mm కు వచ్చారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ తొక్కిసలాట లో రేవతి , ఆమె కొడుకు శ్రీ తేజ లు కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారిద్దరిని వెంటనే పోలీసులు విద్య నగర్ లోని దుర్గాభాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందగా , శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుంచి గాంధీ మార్చురీకి తరలించారు.