అమెజాన్ ప్రైమ్‌లో ప్రస్తుతం ‘చౌర్య పాఠం’ ట్రెండ్ అవుతోంది. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులు పెద్దగా ఈ సినిమా మీద ఆసక్తి కనబరచలేదు. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం జోరు చూపిస్తూ ట్రెండింగ్ లోకి వెళ్ళింది ఈ సినిమా. ఈ క్రైమ్-కామెడీ చిత్రం, ఏప్రిల్ 24, 2025న థియేటర్లలో విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ పొందలేదు. ఐపీఎల్ వంటి సీజనల్ ఈవెంట్‌లు, పెద్ద సినిమాల రీ-రిలీజ్‌లు దీనికి అడ్డంకిగా నిలిచాయి.
Manchu Manoj: ఒక తెలుగు సినిమాని మరో తెలుగు సినిమాతో చంపేస్తున్నారు
అయితే, ఓటీటీలో విడుదలైన తర్వాత ఈ సినిమా అనూహ్యంగా జోరు చూపిస్తూ ట్రెండింగ్ జాబితాలో చోటు సంపాదించింది. చౌర్య పాఠం సినిమా ఒక బ్యాంకును సొరంగం ద్వారా దోచుకునే నిజ జీవిత ఘటన నుంచి స్ఫూర్తి పొందింది. నిర్మాత త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. సినిమాలో రాజీవ్ కనకాల నటన అందరినీ ఆకట్టుకుంది. ఆయన పాత్రకు జీవం పోసి, ప్రమోషన్‌ల సమయంలో కూడా తన ఉత్సాహాన్ని చాటుకున్నారు. హీరో ఇంద్ర రామ్, హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ కెమిస్ట్రీ కూడా బాగుంటుంది.