Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ott News Charishma Naidu Says Kannada Artists Are Being Given More Opportunities In Telugu Serials

Charishma Naidu : కన్నడిగులతోనే తెలుగు సీరియల్స్‌, ఇక మనమెందుకు.. నటి చరిష్మా నాయుడు సంచలన ఆరోపణలు

Published Date :July 5, 2024 , 8:03 am
By Bhargav Chaganti
  • తెలుగు సీరియల్స్‌లో కన్నడ ఆర్టిస్టులదే ఆధిపత్యం
  • హీరో- హీరోయిన్లు -అమ్మమ్మ- అమ్మ పాత్రలకు కన్నడిగులకు
  • తెలుగు సీరియల్స్‌లో తెలుగు వారికి అవకాశం ఇవ్వడం లేదని నటి చరిష్మా నాయుడు ఆవేదన
Charishma Naidu : కన్నడిగులతోనే తెలుగు సీరియల్స్‌, ఇక మనమెందుకు.. నటి చరిష్మా నాయుడు సంచలన ఆరోపణలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Charishma Naidu Comments on Kannada Artists: కన్నడ సీరియల్స్‌లో నెగిటివ్ లేదా సపోర్టింగ్ రోల్స్ చేసిన వారు లేదా అక్కడ అంతగా పాపులర్ కాని వారు తెలుగు, తమిళం, మలయాళం బుల్లితెరపై మెరుస్తున్నారు. అంతే కాకుండా పలువురు ఆర్టిస్టులు అయితే ప్రస్తుతం కన్నడ సీరియల్స్, తెలుగు సీరియల్స్ లో ఒకేసారి నటిస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో కన్నడిగులకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతూ దీన్ని తెలుగు నటి చరిష్మా నాయుడు వ్యతిరేకించారు. పవన్ జనసేన పార్టీలో కూడా యాక్టివ్ గా ఉన్న చరిష్మా నాయుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. తెలుగు టెలివిజన్‌లో కన్నడ కళాకారులు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కళాకారులు విమానంలో వస్తుంటారు ఆ ఖర్చులు తెలుగు నిర్మాతలే భరిస్తున్నారు. వారిని తెచ్చి మంచి పారితోషికం, ఆహార ఖర్చులు -విమాన ఖర్చులు పెట్టుకుంటూ పైపెచ్చు కన్నడిగులకు వసతి ఏర్పాట్లు కూడా తెలుగు నిర్మాతలు చూసుకుంటున్నారు కానీ హైదరాబాద్‌లోని ఆర్టిస్టులకు సీరియల్స్‌లో అవకాశం ఇవ్వడం లేదని ఆమె అన్నారు.

Mirzapur Season 3: మీర్జాపూర్ 3 వచ్చేసింది గురూ!

పారితోషికం కూడా వారితో పోలిస్తే బాలేదు’’ అని చరిష్మా నాయుడు అన్నారు. “తెలుగు టెలివిజన్ ఇప్పుడు కన్నడిగులకు అడ్డాగా మారిపోయింది. తెలుగు సీరియల్స్ లో కన్నడ ఆర్టిస్టులు ఉండడం తప్పు కాదు కానీ అందరూ కన్నడ ఆర్టిస్టులు అయితే ఎలా? ఇప్పుడు అన్ని పాత్రలకు కన్నడ ఆర్టిస్టులు అవసరమా అని ఆమె ప్రశ్నించారు. చరిష్మా నాయుడు మాట్లాడుతూ ఒక తెలుగు సీరియల్‌లో తెలుగు వారు తక్కువ ఉంటారని, మిగిలిన వారు కన్నడిగులే అని అన్నారు. . “తెలుగు వారికి భాష అర్థం అవుతుంది, కన్నడ కళాకారులు ఎలా మాట్లాడినా డబ్బింగ్ చెప్పుకుని మరీ లిప్ సింక్ సరిగా లేకపోయినా కన్నడ నటీనటులు నటన మాత్రం బాగుందని అంటున్నారు. అదే తెలుగు వాళ్ళు ఎలా నటించినా బాగుండదని అంటున్నారు.

తెలుగులో ఆర్టిస్టులుగా ఉండడమే మన తప్పా? మన దగ్గర చాలా మంది ఆర్టిస్టులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదు. బెంగళూరు కళాకారులకు తెలుగులో అవకాశాలు లభిస్తాయి. మరి మనం తెలుగువాళ్ళం ఏం చేయాలి? అని చరిష్మా నాయుడు ప్రశ్నించారు. తెలుగులో అన్ని సాంకేతిక వర్గాలకు ఒక యూనియన్ ఉంది కానీ సీరియల్స్ ఆర్టిస్టులకే లేదని చరిష్మా నాయుడు అన్నారు. అయితే ఇదే విషయం మీద కొంతమంది కన్నడ ఆర్టిస్టులను ప్రశ్నిస్తే “కన్నడలో ఎక్కువ రెమ్యునరేషన్ లేదు. ఒక సీరియల్ హిట్ అయిన తర్వాత అంత త్వరగా మరో సీరియల్ లో నటించే అవకాశం రాదు. కానీ తెలుగులో మాత్రం ఆర్టిస్టులకు మంచి పారితోషికం, ప్రయాణ ఖర్చులు, ఆహార ఖర్చులు ఇస్తారు. అక్కడ కన్నడ కళాకారులను దేవుళ్లలా చూస్తారు’’ అని కామెంట్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Charisma Naidu
  • Kannada Artists
  • Telugu Serials

తాజావార్తలు

  • Akshaye Khanna: ప్రశాంత్ వర్మ ‘యూనివర్స్’లో ధురంధర్ విలన్..

  • Samantha: పెళ్లి తర్వాత సమంతలో కొత్త కళ?

  • Minister Narayana: అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని ఒప్పుకున్నారు.. అధికారంలోకి వచ్చాక భయభ్రాంతులకు గురిచేశారు..!

  • Pat Cummins Injury Update: SRH అభిమానులకు గుడ్ న్యూస్.. కెప్టెన్ ‘కమిన్స్’ రీ-ఎంట్రీపై బిగ్ అప్డేట్..!

  • IPL 2026 Bangladesh Broadcast: ఐపీఎల్ ప్రసారంపై బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం సంచలన ప్రకటన!

ట్రెండింగ్‌

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions