Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Chandrababu Comments On Bhuneswari And Brahmani In Unstoppable Season 4

Unstoppable Season 4: అమరావతిలో తోడు ఎవరూ లేరు.. మేం కూర్చుని మాట్లాడుకుంటే అదే పండుగ!

Published Date :October 25, 2024 , 9:31 pm
By Bhargav Chaganti
Unstoppable Season 4: అమరావతిలో తోడు ఎవరూ లేరు.. మేం కూర్చుని మాట్లాడుకుంటే అదే పండుగ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’ నాలుగో సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ ‘ఆహా’ ఓటీటీలో శుక్రవారం రాత్రి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ముందుగా సీఎంను సాదరంగా ఆహ్వానించిన బాలకృష్ణ.. ‘‘ద్వాపరయుగంలో బావమరిది భవద్గీత చెబితే.. బావ విన్నాడు. ఇక్కడ బావ చెబితే.. బావమరిది వింటున్నాడు’’ అంటూ నవ్వులు పూయించారు. తనకు అది ‘గీత’తో సమానమంటూ ‘అన్‌స్టాపబుల్‌’ పుస్తకంపై చంద్రబాబుతో సరదాగా ప్రమాణం చేయించారు. ఇక ఆ తర్వాత కొన్ని ఫోటోలను చూపించి రెండిట్లో ఏ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలో మీరే చెప్పాలంటూ చంద్రబాబుని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ముందుగా కాఫీ ఆ టీ ఆ అని అడిగితే ఉదయాన్నే ఒక కాఫీ తీసుకుంటానని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Double Ismart: టీవీలోకి డబుల్ ఇస్మార్ట్.. ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?

హైదరాబాదులో ఉంటే భువనేశ్వరితో కలిసి కాఫీ తాగుతానని ఆయన అన్నారు. అదే అమరావతిలో ఉంటే తోడు ఎవరూ లేరు కాబట్టి ఆ డైనింగ్ టేబుల్ తనకు తోడని చెప్పుకొచ్చారు. మా చెల్లెలు మీతో కలిసి కాఫీ తాగి పుష్కరం దాటింది అని చెప్పింది అంటే నిజానికి మా ఇద్దరికి ఏమాత్రం సమయం దొరికినా కూర్చుని మాట్లాడుకుంటాం, మేమిద్దరం కలిసి మాట్లాడుకోవడమే మాకు పెద్ద పండుగలా ఉంటుంది అంటూ ఆయన కామెంట్ చేశారు. ఆ తర్వాత భువనేశ్వరి, బ్రాహ్మణి ఫోటోలు ప్లే చేసి ఇద్దరిలో ఎవరు బాస్ అని అడిగితే నాకు భువనేశ్వరి బాస్ మా అబ్బాయికి బ్రాహ్మణి బాస్ అని చెప్పుకొచ్చారు. మేము తట్టుకోలేకే మీ ఇంటికి పంపించేసామని బాలకృష్ణ అంటే వాళ్ళిద్దరూ చాలా డెడికేటెడ్ అని చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఇద్దరూ చాలా క్రమశిక్షణతో ఉంటారని ఆయన అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhuneswari
  • brahmani
  • chandrababu
  • chandrababu comments
  • Unstoppable Season 4

తాజావార్తలు

  • Telangana Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

  • Lucky Heroine : ఫ్లాప్ హీరోలు ఆమెతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నారు

  • Samsung Galaxy Z Fold 8: సాంసంగ్ ‘వైడ్’ ఫోల్డబుల్ 5G ఫోన్.. 7.6 అంగుళాల స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో

  • Ram Pothineni: నటుడి నుంచి రచయితగా.. రామ్ పోతినేని సరికొత్త ప్రయోగం!

  • Virat Kohli Fans: మీ అభిమానం తగలేయ్య!!.. పేరెంట్స్ కోహ్లీకి బిగ్ ఫ్యాన్స్.. కుమారుడికి ఏం పేరు పెట్టారో చూడండి..

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions