నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ నాలుగో సీజన్ తొలి ఎపిసోడ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ ‘ఆహా’ ఓటీటీలో శుక్రవారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ముందుగా సీఎంను సాదరంగా ఆహ్వానించిన బాలకృష్ణ.. ‘‘ద్వాపరయుగంలో బావమరిది భవద్గీత చెబితే.. బావ విన్నాడు. ఇక్కడ బావ చెబితే.. బావమరిది వింటున్నాడు’’ అంటూ నవ్వులు పూయించారు. తనకు అది ‘గీత’తో సమానమంటూ ‘అన్‌స్టాపబుల్’ పుస్తకంపై చంద్రబాబుతో…