Champion : ‘ఛాంపియన్’ టీజర్..ఇదేదో గట్టిగా కొట్టేట్టు ఉందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో రోషన్ నటిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ టీజర్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జీ స్టూడియోస్ సమర్పణలో, స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన రోషన్, అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ మంచి హైప్ క్రియేట్ చేయగా, తాజాగా రిలీజైన టీజర్ సినిమా స్థాయిని పెంచింది.
Also Read :Deputy CM Pawan: కాశీబుగ్గలోని తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసింది..
Also Read
- Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
- Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
‘ఛాంపియన్’ కథ స్వాతంత్ర్యానికి ముందు హైదరాబాద్‌లో నివసించే ఆర్మీ మాన్, ఫుట్‌బాలర్ అయిన మైఖేల్ సీ. విలియమ్స్ చుట్టూ తిరుగుతుంది. మైదానంలో ప్రత్యర్థులను సవాలు చేస్తూ తన ప్రతిభను ప్రదర్శించే ఈ యంగ్‌మ్యాన్‌కి ఇంగ్లండ్‌లో రాణి ఎలిజబెత్‌ను కలుసుకునే అవకాశం దక్కుతుంది. దేశం కోసం ఆడే అవకాశమొచ్చినా, అతని మనసు మాత్రం తన ప్రేయసి వద్దే ఉంటుంది. కానీ జీవితం అతనికి సవాళ్లు, భావోద్వేగాలు, యుద్ధం, ప్రేమ అన్నీ ఒకేసారి ఎదురుచూపిస్తుంది. ఫుట్‌బాలర్‌గా రోషన్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించాడు. హైదరాబాదీ యాసలో హిందీ మిక్స్ చేసిన అతని డైలాగ్ డెలివరీ చాలా న్యాచురల్‌గా, క్యారెక్టర్‌కి తగినట్టుగా ఉంది.
Also Read :Srikakulam: తొక్కిసలాట ఆలయం కథ..! తిరుమల శ్రీవారి దర్శనం కాలేదని ఏకంగా గుడి నిర్మించిన భక్తుడు..
యాక్షన్ సన్నివేశాల్లో ఎనర్జీ, రొమాంటిక్ సీన్స్‌లో ఫినెస్, ఆత్మవిశ్వాసంతో కూడిన అటిట్యూడ్‌తో రోషన్ ఆకట్టుకున్నాడు. అనస్వర రాజన్ అందంగా కనిపించింది. వీరిద్దరి కెమిస్ట్రీ మనసుకు హత్తుకునేలా ఉంది. దర్శకుడు ప్రదీప్ అద్వైతం స్పోర్ట్స్, డ్రామా, యాక్షన్, రొమాన్స్, వార్ – ఈ అన్ని ఎలిమెంట్స్‌ను అద్భుతమైన నారేషన్‌తో ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆర్. మధీ వండర్‌ఫుల్ విజువల్స్‌ను క్యాప్చర్ చేయగా, మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ టెన్షన్, ఎమోషన్ రెండింటినీ అద్భుతంగా బ్లెండ్ చేశారు. ‘ఛాంపియన్’ టీజర్ హిస్టరీ, స్పోర్ట్స్ డ్రామా, లవ్ స్టోరీ, అద్భుతమైన కంటెంట్‌తో సినిమాపై అంచనాలను పెంచింది. ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్‌కు విడుదల కానుంది.
తాజావార్తలు
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!