రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం సినిమాకి ఆన్ని అడ్డంకులు తొలిగాయి. వైఎస్ జగన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాకి ప్రకటించిన నాటి నుంచే అడ్డంకులు ఎదురవుతూ వచ్చాయి. సినిమా సెన్సార్ చేయక ముందే ఈ సినిమా మీద తెలుగుదేశం పార్టీ కేసులు వేసింది. ఒకసారి సెన్సార్ పూర్తయిన తర్వాత కూడా మరోసారి నారా లోకేష్ కేసు వేయడంతో సెన్సార్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేశారు. మొత్తం మీద టీడీపీ అభ్యంతరాలతో 3 సార్లు సెన్సార్ కు వెళ్లిన వ్యూహం సినిమాకి ఇప్పుడు ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ సభ్యులు సూచించిన మార్పులు మేరకు సినిమాలో 22 చోట్ల మ్యూట్ లు, రెండు సన్నివేశాల తొలగించారు.
Also Read; Sara Tendulkar: అబ్బా ఏమి అందం.. సారా అందానికి కుర్రకారు ఫిదా..
అలాగే సినిమాలో పాత్రలకు పెట్టిన చంద్రబాబు, పవన్, జగన్ పేర్లను సైతం అలా ఉండకూడదు అని చెప్పి సెన్సార్ బోర్డు మార్పించింది. జగన్ రాజకీయ జీవితాన్ని వ్యూహం పేరుతో ఆర్జీవీ తెరకెక్కించారు. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా రెండు సార్లు వాయిదా పడ్డ వ్యూహం సినిమా విడుదలకి ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. మార్చి 2న ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాతో పాటు శపథం అనే సినిమాను దీనికి సీక్వెల్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈ సినిమాకే ఇన్ని ఇబ్బందులు ఎదురైతే ఆ సినిమాకి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలకు వైసీపీ నేత దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించాడు.