మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. ఇండియాస్ ఫస్ట్ సూపర్ ఉమెన్ చిత్రంగా ఓనం కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉదయం ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు రాబడుతుంది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగులోను అదరగొడుతోంది. ఇప్పటివరకు రూ.13 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది.
Also Read : Malayala Beauty : టాలీవుడ్లోకి మరో కేరళ కుట్టి.. బ్రేక్ ఇచ్చేందుకు రెడీ అయిన స్టార్ హీరో కొడుకు
కాగా ఈ సినిమాను రూ. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు నిర్మాత దుల్కర్ సల్మాన్. మలయాళ ఇండస్ట్రీలో ఇది భారీ బడ్జెట్ కింద పరిగణించాలి. దుల్కర్ నమ్మకాన్ని నిలబెట్టిన లోక మలయాళ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. కేవలం 13 రోజులకు గాను రూ. 200 కోట్ల గ్రాస్ రాబట్టి సెన్సేషన్ చేసింది. ఓన్లీ కేరళలో ఇప్పటి వరకు రూ. 70 కోట్లు కొల్లగొట్టి మలయాళ హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల జాబితాల లిస్ట్ లో 4 ప్లేస్ లో నిలిచింది లోక. ఓనం కు మలయాళ స్టార్ హీరో మోహన లాల్ సినిమా రిలీజ్ ఉన్న కూడానా ఆ సినిమాను వెనక్కు నెట్టి దూసుకెళ్తోంది. కన్నడలో కూడా లోక భారీ వసూళ్లు రాబడుతోంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బడ్జెట్. కేవలం ముప్పై కోట్లతో పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు మలయాళ మేకర్స్. వందల కోట్ల బడ్జెట్స్ స్టార్స్ అవసరం లేదు కంటెంట్ ఈజ్ కింగ్ నిరూపించారు.