Buchi Babu: ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ పెద్ది కాదు: బుచ్చిబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buchi Babu: టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్లలో ఒకటైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబో తెరకెక్కిన ‘పెద్ది’పై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక రూమర్ గట్టిగా షికారు చేస్తోంది. గతంలో బుచ్చిబాబు – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ‘పెద్ది’ అనే టైటిల్‌తో ఒక కథ అనుకున్నారని… ఇప్పుడు అదే కథను కొద్దిపాటి మార్పులతో రామ్ చరణ్‌తో తీస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే తాజాగా ఈ రూమర్స్‌పై దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్ కథ వేరు.. చరణ్ కథ వేరు
రూమర్లకు ఫుల్ స్టాప్ పెడుతూ డైరెక్టర్ బుచ్చిబాబు క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చారు. “ఎన్టీఆర్ గారి కోసం నేను రాసుకున్న కథ ‘పెద్ది’ కాదు. అది పూర్తిగా వేరే కథ. ప్రస్తుతం నేను చేస్తున్న ప్రాజెక్ట్ ప్రత్యేకంగా రామ్ చరణ్ గారి కోసమే రాసుకున్నాను” అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఒక్క మాటతో చరణ్ కోసం బుచ్చిబాబు ఒక పక్కా లోకల్, రా అండ్ రస్టిక్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని క్లారిటీ వచ్చేసింది. ‘ఉప్పెన’ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే నేషనల్ అవార్డు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బుచ్చిబాబు… తన తర్వాతి సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. చరణ్ లాంగ్వేజ్, స్టార్డమ్కు సరిపోయేలా ఆయన ఈ కథను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారని సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. చరణ్ కెరీర్లోనే ఇదొక మైల్స్టోన్ మూవీ కాబోతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్నారట. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఒక పవర్ఫుల్ పాత్రలో మెరవనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా ముందుగా ఎన్టీఆర్ కోసం రెడీ చేశారని జరుగుతున్న ప్రచారానికి తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబు క్లారిటీ ఇవ్వడంతో కథపై ఉన్న కన్ఫ్యూజన్ తొలగిపోవడమే కాకుండా… చరణ్ కోసమే పుట్టిన పక్కా స్క్రిప్ట్ ఇదని తేలడంతో మెగా ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రం జూన్ 4న రిలీజ్ కాబోతుంది.
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!