Akhanda 2: అఖండ 2లో బోయపాటి ఇద్దరు కొడుకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ తాండవం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశానికి అంటుతాయి. అయితే, అనూహ్యంగా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో, ఇప్పుడు డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒక రోజు ముందు, అంటే డిసెంబర్ 11వ తేదీన ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం కనిపిస్తోంది.
Also Read:Tata Nexon: మారుతి , మహీంద్రా కంపెనీల కార్లను అధిగమించించిన నెక్సాన్
Also Read
ఇక, ఇదిలా ఉండగా, ఈ సినిమాలో బోయపాటి శ్రీను కుమారులు ఇద్దరూ భాగమవడం గమనార్హం. ఈ సినిమాలో బోయపాటి శ్రీను పెద్ద కుమారుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాక, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సహా, ప్రమోషన్స్‌లో సైతం బోయపాటితో పాటు ఆయన పెద్ద కుమారుడు సైతం కనిపిస్తూ వస్తున్నారు. ఇక, మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో ప్రహ్లాదుడిగా బోయపాటి శ్రీను చిన్న కుమారుడు నటిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్లో కూడా చిన్న పార్ట్ గ్లిమ్స్ ఉంది. నిజానికి, బోయపాటి చిన్న కుమారుడు ‘లెజెండ్’ సినిమాలో కూడా “మావయ్య” అనే ఒక చిన్న డైలాగ్‌తో బాగా వైరల్ అయ్యాడు. ఆ బుడతడిని చూసి అందరూ పాప అనుకున్నారు కానీ, వాస్తవానికి బోయపాటి కుమారుడే ఆ డైలాగ్ పలికింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మరోసారి తన చిన్న కుమారుడిని స్క్రీన్ మీద చూపించబోతున్నారు బోయపాటి శ్రీను.
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..