బాలీవుడ్ స్టార్ హీరోలు మరోసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నారా, స్పెషల్ క్యామియోస్ తో ఆ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, మున్నాభాయ్ సంజయ్ దత్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. అయితే బాలీవుడ్ మూవీలో కాదు హాలీవుడ్ సినిమాలో. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న అమెరికన్ త్రిల్లర్ మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. సినిమాలో వచ్చే అత్యంత కీలకమైన సీక్వెన్స్ లో కనిపించబోతున్నారట ఈ సీనియర్ స్టార్ హీరోలు.
Also Read : Kollywood : హీరోగా వద్దు.. డైరెక్షన్ ముద్దు..
గుట్టు చప్పుడు కాకుంగా సౌదీలో ఈ ఇద్దరిపై సీన్స్ షూట్ చేస్తోన్నట్లు బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు మేకర్స్. సల్మాన్, సంజయ్ బాలీవుడ్ లోనే కాదు మిడిలీస్ట్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. అక్కడ సల్మాన్ సినిమాలు మిలియన్ కలెక్షన్స్ రాబడతాయి. ఇప్పుడు ఈ క్రేజ్ నే క్యాష్ చేసుకోవాలనుకుంటోంది హాలీవుడ్. గ్లోబల్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయడానికి ఈ హీరోలను ఫీల్ట్ లోకి దింపుతోంది. అలాగే ఈ స్టార్ హీరోల మధ్య మంచి ఫ్రెండిషిప్ ఉంది. గతంలో ఈ ఇద్దరు కలిసి చల్ మేరే బాయ్, సాజన్, హే హై జల్వాలో నటించారు. అలాగే చివరి సారిగా 2012లో వచ్చిన అజయ్ దేవగన్ హిట్ మూవీ సన్ ఆఫ్ సర్దార్ లో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిశారు. లాంగ్ గ్యాప్ తర్వాత సంజయ్, సల్మాన్ కలిసి చేస్తున్న ఈ హాలీవుడ్ సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో రానున్న రోజుల్లో తెలుస్తుంది.