బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ ఇటివల తన ‘సితారే జమీన్ పర్’ మూవీ ఓటీటీ హక్కులను ఏ సంస్థకు ఇవ్వనని, యూట్యూబ్‌లో పే పర్ వ్యూవ్ విధానంలో రిలీజ్ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఈ మోడల్‌ను అమలు చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. దీంతో దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సందేహంలో పడిపోయింది. అయితే..
Also Read : Ashika : బంపర్ ఆఫర్ కొట్టేసిన.. ‘నా సామిరంగ’ బ్యూటీ..
తాజా సమాచారం ప్రకారం అమీర్ నిర్ణయానికి నెట్‌ఫ్లిక్స్ దిగొచ్చింది. ‘సితారే జమీన్ పర్’ చిత్రానికి తొలుత రూ. 60కోట్ల డిజిటల్ రైట్స్ ఆఫర్ చేయగా..ఇప్పుడు ఆ రేటును రెండితంలు చేసింది. అంటే రూ.125కోట్లు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని నెట్‌ఫ్లిక్స్ బిజినెస్ టీమ్ అమీర్‌ఖాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నదట. కానీ ఈ విషయంలో అమీర్‌ఖాన్ ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని సమాచారం. నిజానికి ఆ ఓటిటి భయపడటంలో అర్థముంది. ఎందుకంటే ఒకవేళ ‘సితారే జమీన్ పర్’ కనక యూట్యూబ్ లో వర్కౌట్ అయితే మిగిలిన నిర్మాతలు కూడా దాన్నే ఫాలో అయ్యే ప్రమాదముంది. అప్పుడు ఆడియన్స్ టికెట్ డబ్బులను యూట్యూబ్‌లో పెట్టి, ఫ్యామిలీ మొత్తం హాయిగా ఇంట్లోనే కొత్త సినిమాలు చూస్తారు. దీంతో డిజిటల్ బిజినెస్ మొత్తం పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే డబుల్ ఆఫర్ ఇచ్చేందుకు వెనుకాడటం లేదట. మరి చివరికి ఏం అవుతుందో చూడాలి.