స్టార్ హీరో రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’. భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కానుందట. ఇక దీంతర్వాత రవితేజ డైరెక్టర్ కిషోర్ తిరుమలతో ఓ మూవీ కమిట్ అయ్యారు. అయితే ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో, ఇప్పుడు మన టాలీవుడ్ దర్శక రచయితలు అదే జోనర్ లో సినిమాలు చేయాలని ట్రై చేస్తున్నారట. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలు రాసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో హీరో రవితేజకు కిషోర్ తిరుమల కూడా ఇలాంటి ఫ్యామిలి స్టోరినే వినిపించాడట..
Also Read : Kingdom : ‘కింగ్డమ్’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
ఈ సినిమా షూటింగ్‌ను జూన్ నెలలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతుంది. దీంతో ఈ మూవీ కోసం హీరోయిన్‌ల వేట మొదలెట్టారు టీమ్.. ఇప్పటికే కేతికా శర్మను సెలెక్ట్ చేయగా, ఇప్పుడు ఈ సినిమాలో మరో బ్యూటీ కూడా నటిస్తుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా ఆషికా రంగనాథ్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ బ్యూటీ అయినప్పటికి.. ‘నా సామిరంగ’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, మొదటి మూవీతోనే తన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు మాస్ రాజా రవితేజతో రొమాన్స్‌కు రెడీ అయింది. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.