ప్రజంట్ సినీ కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టిన స్టార్ హీరోయిన్ సమంత .. ఇటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రకటించిన సామ్ తిరిగి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. ఇక ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో సిటాడెల్ హానీ బన్నీ వెబ్ సిరీస్ తో వచ్చింది సామ్. కానీ ఫ్యామిలీ మ్యాన్ రేంజ్‌లో అనుకునంతగా స్పందన మాత్రం రాలేదు. దీంతొ ప్రస్తుతం ఆమె నటిస్తున్న మరో సిరీస్ ‘రక్త్ భ్రమండ్’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రహి అనిల్ బర్వే తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్, వామిక గబ్బి, అలీ ఫజల్ తదితరులు ముఖ్యనటిస్తున్నారు. కాగా ఈ సిరీస్‌పై నెట్ ఫ్లిక్స్ కనివిని ఎరుగని బడ్జెట్ ఖర్చు పెడుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘రక్త్ భ్రమండ్’ కి చిన్న బ్రేక్ పడిందట.
Also Read: A. R. Rahman: ‘చావా’ మూవీతో విచిత్రమైన వివాదంలో చిక్కుకున్న ఏఆర్ రెహమాన్
కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోతారు. సెప్టెంబర్ 2024 లో షూటింగ్ మొదలుపెట్టిన ఈ సిరీస్, ఇంకా కీలక దశకు చేరుకోకుండానే యాభై శాతం బడ్జెట్ ఖర్చైపోవడం చూసి టీమ్ షాక్ అవుతుంది. దీంతో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, దాని వెనుక ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నాడని గుర్తించి విచారణ చేసే పనిలో పడింది. నెట్ ఫ్లిక్స్, డి2ఆర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ హారర్ ఫాంటసీ ఇప్పటిదాకా కేవలం 26 రోజులు మాత్రమే చిత్రీకరణ చేశారట. ఇంకా బోలెడు షూటింగ్ బాలన్స్ ఉంది. అయితే ఈ సిరీస్‌ని రాజ్ అండ్ డీకే పర్యవేక్షిస్తుండగా, దర్శకుడు రహి అనిల్ బర్వే సెట్స్‌లో అప్పటికప్పుడు చేస్తున్న మార్పులు చేర్పుల వల్ల కూడా నిర్మాణ వ్యయం పెరుగుతోందట. దీంతో ఎంత ఖర్చు పెట్టడానికైనా నెట్ ఫ్లిక్స్ సిద్ధంగా ఉన్నప్పటికీ కనిపించని స్థాయిలో స్కామ్ జరిగిందని యూనిట్ లో గుసగుస వినపడుతుంది.