భారతీయ రాజకీయాలు, సినిమాలు ఎప్పటినుంచో విడదీయరాని బంధాలు. ఇప్పుడు ఈ రెండు రంగాలను మళ్లీ కలిపే కొత్త గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ భూమి పడ్నేకర్ మరియు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న వార్తలు పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి. ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో ఇద్దరూ కలిసి కనిపించడంతో ఈ రూమర్స్ మరింత వేడెక్కాయి. ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో సినీ, రాజకీయ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. అయితే ఈ ఇద్దరి మధ్య నిజంగానే లవ్ స్టోరీ నడుస్తోందా? లేక ఇది కేవలం అధికారిక మీటింగ్ మాత్రమేనా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
Also Read : Thiruveer: తిరువీర్–ఐశ్వర్య రాజేశ్ కాంబోలో కొత్త సినిమా లాంచ్!
భూమి పడ్నేకర్ 2015లో ‘దమ్ లగా కే హైసా’ సినిమాతో బరిలోకి దిగి, ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథా’, ‘శుభ్ మంగళ్ సావధాన్’, ‘బాలా’, ‘రక్షాబంధన్’, ‘గోవింద నామ్ మేరా’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగా మాత్రమే కాకుండా పర్యావరణ కార్యకర్తగానూ ప్రసిద్ధి గాంచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీలో సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఇక ఆదిత్య థాక్రే విషయానికి వస్తే..
ఆయన మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడు. యువసేన అధ్యక్షుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, 2019లో వోర్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించిన ఆదిత్య ప్రస్తుతం శివసేన (ఉద్ధవ్ బాల్ థాక్రే) పార్టీ లెజిస్లేటివ్ లీడర్‌గా ఉన్నారు. ఇక ఇద్దరూ కలిసి కనిపించడంతో సోషల్ మీడియాలో ప్రేమ రూమర్లు చెలరేగాయి. అయితే, ఆ ఈవెంట్ యంగ్ గ్లోబల్ లీడర్స్ కార్యక్రమానికి సంబంధించినదని, భూమి నిర్వహించిన విందుకు ఆదిత్య హాజరయ్యారని కొందరు చెబుతున్నారు. ఈ వివరణ వచ్చినా కూడా నెటిజన్లు మాత్రం “ఏదో ఉంది!” అంటూ చర్చలు ఆపడం లేదు. మరి నిజంగా వీరి మధ్య స్పెషల్ కనెక్షన్ ఉందా, లేక ఇది మీడియా హడావుడేనా అన్నది చూడాలి!