Bhavanam: ఆగస్టు 9న సస్పెన్స్ థ్రిల్లర్ ‘భవనమ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhavanam Releasing on August 9th: అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలని అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలలో బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘భవనమ్’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ‘భవనమ్’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఆగస్టు 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ‘ది హాంటెడ్ హౌస్’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ చిత్రంలో సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు హ్యుమర్, ఫ్యామిలీ ఫన్ కూడా ఉండబోతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఎక్సైటింగ్ కంటెంట్ తో ఈ సినిమాని తీర్చిదిద్దారు.
Bihar: ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రియురాలితో సహా ముగ్గురు హత్య
Also Read
సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ , బిత్తిరి సత్తి వీరి పాత్రలన్నీ చాలా అద్భుతమైన ఎంటర్ టైనర్ మెంట్ ని అందించబోతున్నాయి. ఈ చిత్రంలో గెటప్ శీను, మురళీ గౌడ్ , జీవన్ నాయుడు, శ్రవణ్ , నాగ మహేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మురళీమోహన్ రెడ్డి ఎస్ డీవోపీగా పని చేస్తున్నారు. ఎన్టీఆర్ ఎడిటింగ్ నిర్వహిస్తుండగా వరతై ఆంటోని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమాలో సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, తాగుబోతు రమేష్, బిత్తిరి సత్తి, అజయ్ , ప్రభాకర్ (బాహుబలి), గెటప్ శీను, మురళీ గౌడ్ , జీవన్ నాయుడు, శ్రవణ్ , నాగ మహేష్ , మాళవిక సతీషన్ , స్నేహ ఉల్లాల్ , స్నిగ్దా, మణిచందన, క్రాంతి, హాన్విక, హారిక కీలక పాత్రలలో నటించారు.
- Tags
- Bhavanam
- bhavanam movie
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..