పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమా వస్తోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. పూరి,సేతుపతి కాంబోలో మొదటి సినిమా కావడంతో పాటు, విభిన్నమైన నటనకు పేరుగాంచిన సేతుపతిని, పూరి ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే టబూ, దునియా విజయ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాకు ‘బెగ్గర్’ తో పాటు ‘భవతి బిక్షామ్ దేహి’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది.
Also Read : WAR 2 : వార్ 2 ట్రైలర్ డేట్ వచ్చేసింది.. సోషల్ మీడియాలో ‘టైగర్ మోడ్’ ఆన్ అయింది
ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో షూటింగ్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేసారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో శరవేగంగా జరుగుతోంది. బేసిక్ గా పూరి జగన్నాధ్ అంటేనే జెట్ స్పీడ్ అని పేరు. ఒక వారంలో స్టోరీ రాసేసి రెండు, మూడు నెలల్లో సినిమాను ఫినిక్ చేయగల సత్తా పూరికి మాత్రమే సొంతం. ఇప్పుడు విజయ్ సేతుపతితో చేస్తున్న సినిమాను కూడా సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నాడు పూరి. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం అందుతోంది. ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. కానీ ఒకరకంగా ఆ డేట్ అంటే కాస్త సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే డిసెంబరు 5న రాజాసాబ్ రిలీజ్ అవుతోంది. అలాగే క్రిస్మస్ కు వారం ముందుగా పాన్ వరల్డ్ ఈసినిమా అవతార్ 3 డిసెంబరు 19న రిలీజ్ కానుంది. అలాగే బాలయ్య అఖండ 2 కూడా సెప్టెంబరు వాయిదా వేస్తె డిసెంబరు లోనే రిలీజ్ ఉండొచ్చు. భారీ సినిమాల బెగ్గర్ పోటీ అంత కరెక్ట్ కాదు అనే టాక్ కూడా ఉంది.