Site icon NTV Telugu

Bedurulanka-2012: ‘బెదురులంక 2012’ నుంచి కార్తికేయ ఫస్ట్ లుక్ రిలీజ్

Bedurulanka 2012 Movie First Look Release

Bedurulanka 2012 Movie First Look Release

Bedurulanka-2012: కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘బెదురులంక 2012’. ఇందులో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ కాగా క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘కలర్ ఫోటో’ నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ సమర్పకుడు. ఈ సినిమా నుంచి కార్తికేయ ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీని గురించి నిర్మాత మాట్లాడుతూ ‘మోషన్ పోస్టర్ చూడగానే మా సినిమా ఎంత విభిన్నంగా ఉండబోతుందనేది అర్థం అవుతుంది. ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో తీసిన చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్. కార్తికేయ, నేహా శెట్టి కాంబినేషన్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

Read also: Pit Bull Dog: వీరంగం సృష్టించిన కుక్క.. ఫ్యామిలీతో యజమాని పరార్

యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఐదు పాటలు ఉన్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన బాణీలు అందించారు. ఓ పాటను స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారు. ఇందులో డ్రామా, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ మెయిన్ హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులను బెదురులంక అనే కొత్త ప్రపంచంలోకి మా సినిమా తీసుకెళ్తుంది. కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని చెప్పారు. దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ‘డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఇందులో కార్తికేయ కొత్తగా కనిపిస్తాడు. విలేజ్ నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో తీసిన సినిమా ఇది’ అని అన్నారు. ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ఇతర పాత్రధారులు.
RC 15: హైదరాబాద్ తిరిగి రానున్న రామ్ చరణ్

Exit mobile version