ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ లో క్యాన్సర్ పరిశోధనల కోసం NRI డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్, డాక్టర్ కల్యాణి ప్రసాద్ భారీ విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘క్యాన్సర్ నుంచి అతి తక్కువ ఖర్చుతో బయటపడాలని ఈ ఆస్పత్రి నీ ఏర్పాటు చేశాము. క్యాన్సర్ చికిత్స తో పాటు పరిశోధనలు చాలా ముఖ్యం. ఆస్పత్రి అంటేనే దేవాలయం తో సమానం. ఇక్కడున్న వైద్యులు, సిబ్బంది ట్రీట్మెంట్ విషయంలో ఎల్లవేళలా జాగరూకతతో ఉంటారు. డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ క్యాన్సర్ పరిశోధనల కోసం భారీ విరాళం అందజేసినందుకు చాలా ఆనందంగా ఉంది. రెండు విడతలుగా 10 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆస్పత్రి లో పరిశోధనలు అభివృద్ధికి ప్రతి పైసా వినియోగిస్తామని మాట ఇస్తున్నా.
Also Read : NBK : రీ – రిలీజ్ కు రెడీ అయిన తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రం
మనిషి తనని తాను అధ్యయనం చేసుకోవడం చాలా అవసరం. క్యాన్సర్ గురించి అవగాహన అవసరం. అవగాహన లేకపోవడం తో లాస్ట్ స్టేజ్ లో తెలుసుకుని చనిపోతున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాము.ఆస్పత్రి విస్తరణకు కృషి చేస్తున్నాం. చికిత్స తో పాటు, పరిశోధనలు కూడా చేపడుతున్నాం. డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ ను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బోర్డు మెంబర్ గా ఆహ్వానిస్తున్నాం. కొత్తగా నిర్మించే బ్లాక్ కి క్యాన్సర్ నీ జయించిన కల్యాణి ప్రసాద్ పేరును ప్రకటిస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమం కోసం విరాళం అందించినందుక చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు. అనంతరం అమెరికాలో ప్రముఖ ఫిలంత్రాఫిస్ట్ గా ఉన్న డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్, కల్యాణి ప్రసాద్ లను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మెన్ ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ సన్మానించారు.