వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య గర్జనకు బాక్సాఫీస్ బద్దలైంది. బాలయ్యను ఓ రేంజ్‌లో చూపించాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. పవర్ ప్యాక్డ్ మాస్ సినిమాగా తెరకెక్కిన వీరసింహారెడ్డి నందమూరి ఫ్యాన్స్‌కు మాసివ్ ట్రీట్ ఇచ్చింది. దీంతో మరోసారి గోపిచంద్‌తో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇటీవల డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు బాలయ్య.
Also Read :Spirit : సందీప్ రెడ్డి స్పెషల్ కండిషన్స్.. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్!?
అఘోరాకు సంబంధించిన కీలక సన్నీవేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత గోపీచంద్ సినిమా మొదలు కానుంది. గోపీచంద్ కూడా తను చేస్తున్న బాలీవుడ్ సినిమా ‘జాట్’ పూర్తి కాగానే బాలయ్య కథ మీద కూర్చోనున్నాడు. అయితే ఈసారి గోపీచంద్ మలినేని, బాలయ్యతో చేసే సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఊర మాస్ సినిమా ప్లానింగ్‌లో ఉన్నాడట. ఇప్పటికే బాలయ్య అఖండ 2ని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు గోపీచంద్ సినిమాను కూడా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇటీవల డాకు మహారాజ్ సినిమాను ఓటిటిలో రిలీజ్ చేయగా పాన్ ఇండియా లెవల్లో అన్నీ భాషల్లోను మాసివ్ రెస్పాన్స్ వస్తోంది. అందుకే.. అఖండ 2 నుంచి బాలయ్య చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో రానున్నాయనే చెప్పాలి. గోపీచంద్ తర్వాత డాకు మహారాజ్ డైరెక్టర్ బాబీతో మరో సినిమా ప్లానింగ్‌లో ఉన్నాడు బాలయ్య. ఏదేమైనా ప్రస్తుతం బాలయ్య క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉందనే చెప్పాలి.