Bhagavanth Kesari : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.“అఖండ” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాలయ్య ఆ తర్వాత వరుస సినిమాలతో బాలయ్య సూపర్ హిట్స్ అందుకున్నారు.గత ఏడాది బాలయ్య నటించిన బ్లాక్ బస్టర్ మూవీ భగవంత్ కేసరి ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా 70 కోట్లకు పైగా షేర్ ని అలాగే 132 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా ఓటిటిలో కూడా అదరగొట్టింది.అలాగే టెలివిజన్ లో కూడా మంచి రేటింగ్స్ సాధించి అదరగొట్టింది.ఇదిలా ఉంటే బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా మరో అరుదైన ఘనత సాధించింది.
Read Also :SSMB29:మహేష్ స్టన్నింగ్ లుక్ అదిరిపోయిందిగా..
ఒక థియేటర్ లో రోజుకి 4 షోలతో రన్ అవుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 210 రోజులను పూర్తి చేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్ లో ఈ సినిమా రోజుకి 4 ఆటలు ప్రదర్శితం అవుతూ ఇప్పుడు 210 రోజులను కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించింది.తాజాగా థియేటర్ లీజ్ ప్రొప్రయిటర్ షాక్ చాన్ సుభాన్ అక్విల్ బాలయ్య సినిమా ఈ ఘనత సాధించడంతో స్పందించారు.మా చిలకలూరిపేట చరిత్రలో డైరెక్ట్ 4 ఆటలతో గ్యాప్ లేకుండా ద్విశతదినోత్సవము జరుపుకున్న తొలి చిత్రంగా రికార్డు సృష్టించి గతంలో “పోకిరి” చిత్రం ద్వారా ఉదయం ఆటలతో ద్విశత దినోత్సవము జరుపుకున్న ఘనతని కూడా మా థియేటర్ కె అందించి రెండు ద్విశత దినోత్సవ చిత్రాల థియేటర్ గా నిలిపిన ప్రేక్షక మహాశయులకు మా ధన్యవాదాలు అని తెలిపారు.