Site icon NTV Telugu

Tollywood : దుమ్ములేపిన బాలయ్య, వెంకీ.. నిరాశపరిచిన చిరు, మహేశ్, రెబల్ స్టార్

Tollywood (2)

Tollywood (2)

ఈ ఏడాది టాలీవుడ్ టాప్ హీరోల్లో నాగార్జున రెండు, వెంకటేష్ ఓ మూవీతో ఫ్యాన్స్‌ను పలకరిస్తే, ఇయర్ స్టార్టింగ్‌లో  హిట్ కొట్టిన బాలకృష్ణ ఎండింగ్‌లో బాక్సాఫీసు దండయాత్రకు రెడీ అయ్యారు. డిసెంబరు 5న రిలీజ్ కు రెడీ అవుతోంది అఖండ 2. ఇక మెగాస్టార్ చిరంజీవి, డార్లింగ్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ఆడియన్స్‌ను కాస్త నిరూత్సాహానికి గురి చేశారు. కాస్తలో కాస్త రెబల్ స్టార్ నయం. రాజా సాబ్ ఏప్రిల్ నుండి డిసెంబర్ బరికి ఆపై నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి షిఫ్ట్ అయినా కన్నప్ప క్యామియో అప్పీరియన్స్ బాహుబలి ది ఎపిక్ రూపంలో కనిపించి. ఫ్యాన్స్ ను కూల్ చేయగలిగాడు.

Also Read : The RajaSaab : రాజాసాబ్ రిలీజ్ పోస్ట్‌పోన్.. అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసిన నిర్మాత

ఇక నెక్ట్స్ ఇయర్ డబుల్ ధమాకా ప్లాన్ చేస్తున్నాడు. రాజా సాబ్ పొంగల్ బరిలో దిగుతుండగా హను ఫౌజీ కూడా ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారన్నది బజ్. మెగాస్టార్ చిరంజీవి రెండేళ్లుగా ఫ్యాన్స్ ను వెయిటింగ్ లో పెట్టారు. ఈ ఏడాది వస్తారు అనుకుంటే డై హార్ట్ అభిమానులకు నిరాశ తప్పలేదు. 2024, 2025 మిస్సైన లెక్కలన్నీ 2026లో సరిచేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు మెగాస్టార్. సంక్రాంతికి మన శంకర్ వర ప్రసాద్ గారుతో హంగామా మొదలు పెట్టి సమ్మర్ లో విశ్వంభరతో కంటిన్యూ చేయబోతున్నారు. అలాగే బాబి దర్శకత్వంలో మూవీ కూడా నెక్ట్స్ ఇయర్ ఎండింగ్ కు వచ్చే ఛాన్సు ఉందని టాలీవుడ్ వర్గాల మాట. ఈ ఇద్దరు సంగతి సరే మరి గుంటూరు కారం తర్వాత రాజమౌళి చేతిలో పడ్డ మహేష్ బాబు ఈ ఏడాది మిస్సైనా నెక్ట్స్ ఇయరైనా వస్తాడా అంటే డౌటుగానే కనబడుతోంది. అసలు ఈ సినిమా ఎప్పుడు ఫినిష్ అవుతుంది ఎప్పుడు వస్తుంది అన్నది రాజమౌళి చేతుల్లోనే ఉంది.

Exit mobile version