నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. ఉగాది కానుకగా ఈ చిత్రం నుంచి ఏప్రిల్ 13న విడుదలైన టైటిల్ రోర్ ‘అఖండ’ వీడియో బాలయ్య కెరీర్లోనే నెవర్ బిఫోర్ రికార్డులను క్రియేట్ చేస్తోంది ఈ చిత్రం. ఈ చిత్రంలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా… ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ‘అఖండ’ మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజాగా ఈ సినిమా కోసం బాలకృష్ణ తీసుకున్న పారితోషికం ఎంత ? అనే విషయమై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే సాధారణంగా ఒక సినిమాకు 10 కోట్లు పారితోషికంగా తీసుకునే బాలకృష్ణ… ‘అఖండ’కు మాత్రం కేవలం 7 కోట్లే తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘అఖండ’కు దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించిన నిర్మాతలు నాన్ ప్రొడక్షన్ కాస్ట్ ను తగ్గించాలని నిర్ణయించుకున్నారట. ఈ కారణం చేతనే బాలయ్య తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం హిట్ అయ్యి, మంచి కలెక్షన్లు రాబడితే మాత్రం బాలయ్య లాభాలలో వాటా తీసుకుంటారని అంటున్నారు. ఇక గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం ‘అఖండ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.