Site icon NTV Telugu

Balakrishna: బాలయ్యపై ఇంత భారీ బడ్జెట్ వర్కవుట్ అవుతుందా?

Balakrishna

అఖండ.. వీరసింహారెడ్డి.. భగవంత్‌ కేసరితో హ్యాట్రిక్‌ కొట్టిన బాలకృష్ణ ఫుల్‌ ఫామ్‌లో వున్నాడు. వీరసింహారెడ్డితో నాలుగో హిట్‌ వెనకేసుకున్నాయి. అయితే… సినిమా సినిమాకూ బడ్జెట్‌ పెరిగిపోవడం ఫ్యాన్స్‌ను భయపెడుతోంది. ఇక సెట్స్‌పై వున్న అఖండ2 అయితే బడ్జెట్‌ లిమిట్స్‌ దాటేసింది. బాలయ్య కెరీర్‌లో హయ్యెస్ట్‌ కలెక్ట్ చేసిన సినిమా కంటే ఎక్కువ డబ్బులు పెట్టేయడంతో.. బడ్జెట్‌ ఎక్కడుకెళ్లి ఆగుతుందో తెలీయడం లేదు.

Also Read :Nayanthara : చేతిలో 9 సినిమాలు.. ఆల్ టైమ్ రికార్డ్!

వరుసగా నాలుగు హిట్స్‌తో ఫుల్‌ ఫామ్‌లో వున్న బాలయ్య రెమ్యునరేషన్‌ పెంచకుండా వుంటాడా? అఖండ ముందు వరకు 10 కోట్లున్న బాలయ్య రెమ్యునరేషన్‌ ప్రస్తుతం 40 కోట్లకు చేరడంతో.. ఆటోమెటిక్‌గా బడ్జెట్‌ పెరిగిపోతుంది. ప్రస్తుతం బాలయ్య రెమ్యునరేషన్తో గతంలో సినిమా పూర్తయ్యేది. సినిమా సినిమాకూ బాలకృష్ణ బడ్జెట్‌ పెరగడంతోపాటు.. బిజినెస్‌ కూడా పెరుగుతోంది. అఖండను 53 కోట్లకు అమ్మితే 75 కోట్లు తీసుకొచ్చింది. వీరసింహారెడ్డి దగ్గరకొచ్చేసరికి ఒకేసారి బిజినెస్‌ 20 కోట్లు పెరిగి 73 కోట్లకు అమ్మగా 80 కోట్లు రాబట్టింది. ఇక భగవంత్‌ కేసరి మెసేజ్‌ ఓరియెంటెడ్‌ మూవీ కావడంతో బిజినెస్‌ తగ్గి 67 కోట్లకే జరిగితే.. 71కోట్లు వచ్చింది. డాకూ మహరాజ్‌ను 80 కోట్లకు అమ్మితే.. 82 కోట్లు కలెక్ట్ చేసింది.

Also Read :The Great Pre Wedding Show: ఆసక్తికరంగా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్

బాలకృష్ణ గత నాలుగు సినిమాల బిజినెస్‌.. కలెక్షన్స్‌ చూస్తుంటే..బాలయ్య 80 కోట్ల మార్క్‌ దాటడమే గగనమైపోతోంది. 82 కోట్లు కలెక్ట్ చేసిన డాకు మహారాజ్‌ హయ్యెస్ట్‌ షేర్‌గా నిలిచింది. ఇలా 100 కోట్ల క్లబ్‌ బాలయ్యను ఊరిస్తుందేగానీ.. దక్కడం లేదు. బడ్జెట్‌ మాత్రం అఖండతో 100కోట్లు దాటేసింది. అఖండ2 వచ్చేసరికి బోయపాటి బడ్జెట్‌ను భారీగా పెంచేశాడు. హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమాను పాన్‌ ఇండియాగా రిలీజ్‌ చేస్తున్నారు. బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్స్‌ ఓ రేంజ్‌లో వుంటాయి. ఇంతవరకు 100 కోట్ల కలెక్షన్స్‌ లేని బాలయ్యపై 120 కోట్ల బడ్జెట్‌ పెట్టేయడం రిస్కేగానీ.. హిట్‌ టాక్ వస్తే.. పెద్ద కష్టం కాకపోవచ్చు.

అఖండ2 తర్వాత బాలయ్య గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. వీరసింహారెడ్డి సక్సెస్‌ తర్వాత ఈ హిట్‌కాంబో రిపీట్‌ అవుతోంది. డిసెంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. అఖండ2 బడ్జెట్‌ 120 కోట్లే ఎక్కువంటే.. గోపీచంద్‌ ఇంతకుకమించి బడ్జెట్‌ పెట్టిస్తున్నాడని తెలిసింది. హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌ కథను రాసుకోవడంతో.. ఖర్చు ఎక్కువే అవుతోందట. బాలకృష్ణ వరుసగా 4 హిట్స్‌తో ఎంత ఫామ్‌లో వున్నా.. 120 కోట్లకు పైగా బడ్జెట్‌ అంటే.. థియేటరికల్‌ రైట్స్‌ కూడా 100 కోట్లు దాటేస్తుంది. ఒకరకంగా ఇది రిస్క్‌ చేయడమే. బాలయ్య అంటే ఒకప్పుడు తక్కువ బడ్జెట్‌.. ఎక్కువ లాభాలన్న పేరుండేది. హిట్‌ కాంబినేషన్‌ పేరు చెప్పి బడ్జెట్‌ను 100 కోట్లు దాటించేస్తున్నారు.

Exit mobile version